అల్లరి బుల్లోడు 1978లో విడుదలైన తెలుగు సినిమా. మారుతీ కంబైన్స్ పతాకంపై ఎ. గోపాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు జి.సి.శేఖర్ దర్శకత్వం వహించాడు. కృష్ణ, జయప్రద ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతాన్నందించాడు.

తారాగణం 

 ఘట్టమనేని కృష్ణ
 జయప్రద
 అంజలీదేవి
 గుమ్మడి వెంకటేశ్వరరావు
 రాజబాబు
 జయమాలిని

సాంకేతిక వర్గం 
పాటలు: ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి

నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, చక్రవర్తి

సంగీతం: కె.చక్రవర్తి

సమర్పణ: ఎ.లక్ష్మీకుమార్

నిర్మాత: ఎ.గోపాలకృష్ణ

దర్శకుడు: జి.సె.శేఖర్

బ్యానర్: మారుతీ కంబైన్స్

పాటలు

మూలాలు

బాహ్య లంకెలు 
 

ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
గుమ్మడి నటించిన చిత్రాలు
జయమాలిని నటించిన సినిమాలు
అల్లరి కృష్ణయ్య 1987 లో తెలుగు చిత్రం. దీనిని సిహెచ్ సత్యనారాయణ, ఎస్. భాస్కర్ వనితా ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. దీనికి నందమూరి రమేష్ దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ, భానుప్రియ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

కథ 
విశ్వసనీయ తీర్పులను విచారించే నరసయ్య (రావు గోపాలరావు), అతని మేనల్లుడు మాధవయ్య (జగ్గయ్య) పాలనలో ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. రెండు కుటుంబాలు మంచి సంబంధాన్ని కొనసాగిస్తాయి. ధైర్యవంతుడైన గోపాల కృష్ణ / కృష్ణయ్య (నందమూరి బాలకృష్ణ) మాధవయ్య యొక్క తమ్ముడు. అతను తన సోదరుడు, వదిన సావిత్రి (జయంతి) ని ఆరాధించేవాడు. అతను నరసయ్య కుమార్తె లలిత (భానుప్రియ) ను ప్రేమిస్తాడు. వారికి వివాహం నిశ్చితార్థం అవుతుంది.. అంతేకాకుండా ఇద్దరు దుర్మార్గులైన వీరభద్రయ్య (చలపతి రావు), కరణం కనకయ్య (గొల్లపూడి మారుతీరావు) గ్రామంలో అనేక అనాగరిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఇంతలో వచ్చిన పంచాయితీ ఎన్నికలలో నరసయ్య, మాధవయ్య వేర్వేరు పార్టీల తరపున పోటీ చేయడం వల్ల వారి మధ్య అంతరం తలెత్తుతుంది. వారిమధ్య శత్రుత్వంగా మారుతుంది.

అంతేకాక, వీరభద్రయ్య యొక్క దుర్మార్గపు కుమారుడు సుందరం (సుధాకర్) తో లలితను జత చేసేందుకు కనకయ్య కుట్ర పన్నాడు. కృష్ణయ్య వారి కుట్రను విడదీసి మాధవయ్య వ్యతిరేకించినా లలితను వివాహం చేసుకుంటాడు. అందుకే వారు కూడా విడిపోయారు. ప్రస్తుతం, ప్రతి సంవత్సరం నరసయ్య, మాధవయ్య పర్యవేక్షణలో జరిగే పండుగకు సమయం ఆసన్నమైంది. ఇక్కడ, కృష్ణయ్య దానిని నిర్వహించాల్సిన బాధ్యత తీసుకుంటాడు. వారిని కూడా ఒప్పించాడు. దేవుని నగలు దొంగతనం చేసి దైవద్రోహం చేసినట్లు నరసయ్య పై నేరం మోపుతారు.

చివరికి, కృష్ణయ్య వాస్తవికతను వెల్లడించి తన మామను నిర్దోషిగా ప్రకటించాడు. చివరగా, కుటుంబం తిరిగి కలుసుకోవడంతో సినిమా సంతోషకరమైన వాతావరణంతో ముగుస్తుంది.

తారాగణం 

 నందమూరి బాలకృష్ణ గోపాల కృష్ణుడిగా
 భానుప్రియ లలితగా
 రావు గోపాలరావు నరసయ్యగా
 జగ్గయ్య మాధవయ్యగా
 గొల్లపూడి మారుతీరావు కరణం కనకయ్యగా
 మిక్కిలినేని ధర్మయ్యగా
 చలపతి రావు వీరభద్రం
 సుధాకర్ సుందరం గా
 రాజుగా అరుణ్ కుమార్
 శేషుగా రాజ్ వర్మ
 మానిక్ ఇరానీ రౌడీగా
 పి. జె. శర్మ కలెక్టర్‌గా
 మల్లాడి ప్రీస్ట్‌గా
 పాపారావుగా గోక్కిని రామారావు
 చిట్టి బాబు చిట్టిగా
 రమణ రెడ్డి
 జగ్గారావు
 జయంతి సావిత్రిగా
 అన్నపూర్ణ పూర్ణగా
 కల్పనా రాయ్ పంకజంగా
 వై. విజయ చిత్రంగీగా

పాటలు

మూలాలు

బాహ్య లంకెలు 

నందమూరి బాలకృష్ణ సినిమాలు
రావు గోపాలరావు నటించిన చిత్రాలు
కల్పనా రాయ్ నటించిన సినిమాలు
అల్లరి మొగుడు 1992 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా ప్రధాన పాత్రలు పోషించారు. దీనిని 1994లో తమిళంలో రజనీకాంత్, మీనా, రోజా ప్రధాన పాత్రల్లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వీరా పేరుతో పునర్నిర్మించారు. దీనినే కన్నడ, హిందీలోకి కూడా పునర్నిర్మాణం చేశారు.

కథ 
గోపాల్ (మోహన్ బాబు) పల్లెటూరు నుంచి నగరానికి వచ్చిన తనకు తెలిసిన సంగీతంతో ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలనుకుంటాడు. అదే విధంగా అక్కడికి వచ్చిన ఒక తబలా కళాకారుడు సత్యం (బ్రహ్మానందం) అతనితో కలుస్తాడు. ఇద్దరూ కలిసి ఉద్యోగ వేటలో పడరాని పాట్లు పడుతుంటారు.

తారాగణం
 గోపాల్/ కృష్ణ గా మోహన్ బాబు
మోహన గా రమ్యకృష్ణ
నీలాంబరి గా మీనా
మ్యూజిక్ కంపెనీ ఓనరు, మోహన తండ్రి గా కైకాల సత్యనారాయణ
సత్యం గా బ్రహ్మానందం
సంగీత విద్వాంసుడిగా నగేష్
జె.వి. సోమయాజులు
అన్నపూర్ణ
ప్రసాద్ బాబు
రామిరెడ్డి
కాస్ట్యూమ్స్ కృష్ణ

బయటి లింకులు

పాటలు
 నా పాట పంచామృతం
 రేపల్లె మళ్ళీ మురళి విన్నది
 బం చికి బం బం చెయ్యి బాగా
 ముద్దిమ్మంది ఓ చామంతి
 నీలి మబ్బు నురగలో కాలు జారి పడ్డ వేళ
 అబ్బా...నను గన్న అమ్మ బాబు గుర్తొచ్చాడోయబ్బా...ఈ మగాడి దెబ్బా

మూలాలు 

బ్రహ్మానందం నటించిన సినిమాలు
సత్యనారాయణ నటించిన చిత్రాలు
కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రాలు
అల్లరి పాండవులు 1987లో విడుదలైన డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. శ్రీ రవిశంకర్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.శ్రీరామమూర్తి, పి.శంకర్ లు నిర్మించిన ఈ సినిమాకు ఎం.బాలయ్య దర్శకత్వం వహించాడు. తులసీ రాం, నారాయణరావు, అశ్వని ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్ జోటి సంగీతాన్నందించాడు.

తారాగణం 

 తులసీరాం
 నారాయణరావు
 అశ్వని

సాంకేతిక వర్గం 

 సంగీతం: రాజ్ కోటి
 దర్శకత్వం: ఎం.బాలయ్య
 నిర్మాతలు: వి.శ్రీరామమూర్తి, పి.శంకర్

పాటలు 

 అందెల్లో ఆనందం చిందెనమ్మా చిందుల్లో ఆకాశం... ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
 స్వాగతం  చైత్రమా  స్వాగతం సాగిరా చైత్రమా స్వాగతం..... పి.సుశీల, నాగూర్ బాబు
 పూయనీ ఓ మోహినీ పువ్వులై నా ఊహనీ మల్లెల వీణ.....ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
 ఏడవకు ఎర్రినాయన అచ్చు బెల్లం పెడతా.....ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు
 శ్రీమద్రమా రమణ.....నాగూర్ బాబు
 అందెల్లో ఆనందం చిందెనమ్మా చిందుల్లో ఆకాశం...ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
 ఎందుకురా ఈ గందరగోళం వద్దురా ఈ మేళం ...మనో బృందం

మూలాలు

బాహ్య లంకెలు
అల్లరి పెళ్లాం 1998 జూలై 16న విడుదలైన తెలుగు సినిమా.

నటీనటులు
 శివాజీ రాజా
 శుభశ్రీ
 జయంతి
 జయలలిత
 పూజిత
 ధర్మవరపు సుబ్రహ్మణ్యం
 గౌతంరాజు 
 మహర్షి
 సుత్తివేలు

సాంకేతికవర్గం
 దర్శకత్వం: శివాజీ
 కథ: డి.ప్రభాకర్ ముదిరాజ్
 మాటలు: యర్రంశెట్టి సాయి
 సంగీతం: రమణి భరద్వాజ్
 కూర్పు: పల్లా వెంకటరామ్‌
 పాటలు: సాహితి, ఎ.ఎస్.మూర్తి, సుద్దాల అశోక్ తేజ
 ఛాయాగ్రహణం: పి.దివాకర్
 నిర్మాత: డి.రుక్మిణీదేవి ముదిరాజ్

పాటలు
 ఎల్విస్ ప్రేస్లి పాటలురాక్ అండ్ రోల్ - సుచిత్రా కృష్ణమూర్తి - రచన: ఇ.ఎస్.మూర్తి
 కోపాల గోపాలుడే మా శ్రీవారు అయ్యారా - అనురాధ శ్రీరామ్,రమణి భరద్వాజ - రచన: సాహితి
 చుక్క చుక్కబుగ్గమీద రాయించవు - సుచిత్రా కృష్ణమూర్తి - రచన: ఇ.ఎస్.మూర్తి
 జిలిబిలి పలుకుల చిన్నదిరో చిగురుల - మనో, అనురాధ శ్రీరామ్ కోరస్ - రచన: సాహితి
 వామ్మో ఈ హైదరాబాదు ఏందిరో బల్ తమాషగ ఉంది - మనో బృందం - రచన: సుద్దాల అశోక్ తేజ
 వెన్నెల సూదులుకచ కచ గుచ్చెను - ఎం.రాము, మనికిరణ్, శివరాం బృందం - రచన: సుద్దాల అశోక్ తేజ

మూలాలు

బయటి లింకులు

శివాజీ రాజా నటించిన చిత్రాలు
సుత్తి వేలు నటించిన సినిమాలు
అల్లరి పెళ్ళి కొడుకు 1997 లో విడుదలైన తెలుగు సినిమా. మానస ఆర్ట్ మూవీస్ పతాకంపై టి.రవీందర్, ఎం.రాజ్ కుమార్, డి.సంపత్ లు నిర్మించిన ఈ చిత్రానికి జె.జె.ప్రకాశరావు దర్శకత్వం వహించాడు. ఆలీ, శుభశ్రీలు ప్రధాన పాత్రలుగా, సుమన్, మహేశ్వరి అతిథి పాత్రలలో నటించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.

తారాగణం 

 ఆలీ
 శుభశ్రీ
 కీర్తన
 రాగిణి
 శివాజీ రాజా
 బాబూ మోహన్
 కాస్ట్యూమ్స్ కృష్ణ
 బాలయ్య
 మల్లిఖార్జునరావు
 గుండు హనుమంతరావు
 కళ్ళు చిదంబరం
 ఐరన్ లెగ్ శాస్త్రి
 చిట్టిబాబు
 ప్రసన్నకుమార్
 గౌతం రాజు
 కృష్ణవేణి
 సుమన్ (అతిథి పాత్ర)
 మహేశ్వరి (అతిథి పాత్ర)

సాంకేతిక వర్గం 

 సమర్పణ: సి.హెచ్.ఇంద్రసేనారెడ్డి
 బ్యానర్: మానస ఆర్ట్ మూవీస్
 మాటలు: మరుధూరి రాజా
 పాటలు: భువనచంద్ర, జొన్నవిత్తుల, గురుచరణ్
 నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, మనో, స్వర్ణలత
 స్టిల్స్: ఎం.వీరబాబు
 అపరేటివ్ ఛాయాగ్రహణం: పైడాల శ్రీనివాస్, బండి రత్నకుమార్
 పోరాటాలు: విక్కీ
 నృత్యాలు: సుచిత్ర, లారెన్స్, నల్లశ్రీను, విజయ్
 కళా దర్శకుడు: వి.నారాయణ
 కూర్పు:రమేశ్
 ఛాయాగ్రహణం: సి.విజయ్ కుమార్
 సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
 నిర్మాతలు: టి.రవీందర్, ఎం.రాజ్ కుమార్, డి.సంపత్
 కథ, చిత్రానువాదం, దర్శకత్వం:జె.జె.ప్రకాశరావు

మూలాలు

బాహ్య లంకెలు 
 
 

గుండు హనుమంతరావు నటించిన సినిమాలు


కథ 
శ్రీనివాసరావు పెద్ద సైకిలు కంపెనీ యజమాని. ఆయన భార్య లక్ష్మి ఎల్లవేళలా పూజలు, పునస్కారాలతో మునిగి తేలుతూ వుంటుంది. ఒక రోజున శ్రీనివాసరావు ఆఫీసులో ఉండగా నిర్మల అనే అమ్మాయి వస్తుంది. తమది తిరుపతి అని, గోవిందరాజస్వామి గుడి వెనుక వీధిలో డాబాపై వుండే పద్మావతి తన తల్లి అని చెబుతుంది. దానితో శ్రీనివాసరావులో కలవరం బయలుదేరుతుంది. మీరే నా తండ్రి అంటుంది ఆ అమ్మాయి. ఆ విషయం బయటకు చెప్పవద్దు అని శ్రీనివాసరావు ఆమెను బతిమాలతాడు. నిర్మలను తన ఇంటికి తీసుకువెళ్ళి ఈమె నా పి.ఎ.అని, మన ఇంట్లోనే ఉంటుంది అని అందరికీ చెబుతాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు కుమార్ అనే కుర్రాడు డాడీ! డాడీ! అంటూ వస్తాడు. తిరుపతి గోవిందరాజస్వామి గుడి వెనుక వీధిడాబాపై వుండే పద్మావతి తన తల్లి అని శ్రీనివాసరావే తన తండ్రి అని చెబుతాడు. శ్రీనివాసరావుకు ఏమి చేయాలో పాలుపోక కుమార్‌ను కూడా తన పి.ఎ.గా ఇంట్లో ప్రవేశపెడతాడు. శ్రీనివాసరావు తనకు తండ్రి అంటే తనకు తండ్రి అని ఇద్దరు పి.ఎ.ల మధ్య పోరాటం ప్రారంభమౌతుంది. ఇంతలో సైనికుడి దుస్తుల్లో వున్న యువకుడు వచ్చి తాను శ్రీనివాసరావు కుమారుడు అని చెబుతాడు. తన అమ్మమ్మ, తాతయ్య ఇచ్చిన ఉత్తరం చూపిస్తాడు. చిత్రంలో ఇలా కథ వింత వింత మలుపులు తిరుగుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది.

నటీనటులు
 జయచిత్ర
 రామకృష్ణ
 నాగభూషణం
 రాజబాబు
 చంద్రమోహన్
 అపర్ణ
 శరత్‌బాబు
 ధూళిపాళ
 సావిత్రి
 దేవదాస్ కనకాల
 పి.వరలక్ష్మి
 మాడా వెంకటేశ్వరరావు

పాటలు

మూలాలు

డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
ఘంటసాల గళామృతం

ధూళిపాళ నటించిన చిత్రాలు
అల్లరి పోలీస్ 1994లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ విష్ణు విక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, మాలాశ్రీ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్నందించాడు.

తారాగణం 

 మోహన్ బాబు
 మాలాశ్రీ
 ఆమని
 బాబూ మోహన్
 ఆలీ
 రాళ్లపల్లి
 మల్లిఖార్జునరావు
 మోహన్ రాజ్
 నర్రా వెంకటేశ్వరరావు
 చిట్టిబాబు
 చిడతల అప్పరావు
 అశోక్ కుమార్
 అమర్
 థమ్
 రాజేశ్వరి
 రాఘవమ్మ
 దేవి
 పద్మ
 తోటపల్లి మధు (విలన్ గా తొలి పరిచయం)

సాంకేతిక వర్గం 

 బ్యానర్: శ్రీ విష్ణు పిక్చర్స్
 సమర్పణ: మోహన్ బాబు
 కథ: కె.సుభాష్
 మాటలు: తోటపల్లి మధు
 పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, జాలాది, గురుచరణ్
 నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు, నాగూర్ బాబు, కె.ఎస్.చిత్ర
 స్టిల్స్: పి.ఎస్.చంద్ర
 పోరాటాలు: పంబల్ రవి
 నృత్యం: డి.కె.ఎస్.బాబు, శ్రీనివాస్
 కళ:శ్రీనివాసరాజు
 కూర్పు: గౌతంరాజు
 ఛాయాగ్రహణం: విన్సెంట్, అజయ్ విన్సెంట్
 సంగీతం: ఇళయరాజా
 స్కీన్ ప్లే: ఎం.మోహన్ బాబు
 నిర్మాత: ఎం.కృష్ణ
 దర్శకుడు: ఉప్పలపాటి నారాయణరావు

మూలాలు

బాహ్య లంకెలు 

రాళ్ళపల్లి నటించిన సినిమాలు
అల్లరి ప్రేమికుడు 1994లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇందులో జగపతి బాబు, సౌందర్య, రంభ, కాంచన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సురేష్, సత్యానంద్ కలిసి శ్రీ సత్యదుర్గాఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. ఇది తమిళంలో పోక్కిరి కాదలన్  అనే పేరుతో అనువాదం అయింది.

కథ 
కృష్ణమూర్తి అలియాస్ కిట్టు తన స్నేహితుడైన చంద్రంతో పందేలు కాస్తుంటాడు. ఒకసారి కృష్ణమూర్తి భవాని, ఝాన్సీ, జోగీశ్వరి దేవి అనే ముగ్గురు అమ్మాయిలను ప్రేమలోకి దింపుతానని చంద్రంతో పందెం కాస్తాడు. కిట్టు ఒక హోటల్ లో సంగీత కళాకారుడుగా పనిచేస్తాడు.
భవాని కళాశాలలో చదువుతూ మహిళల తరపున పోరాడుతుంటుంది. ఆమెకు తగినట్టుగా కిట్టు మహిళలను గౌరవించేవాడిగా ప్రవర్తిస్తుంటాడు. కిట్టు ఖాన్ దాదా పేరుతో చలామణి అయ్యే అహోబిలంతో ఒప్పందం కుదుర్చుకుని అతను మహిళలను వేధిస్తుండగా అతన్ని ఎదిరించి భవాని తనను అభిమానించేలా చేస్తాడు.

ఝాన్సీ పోలీస్ ఇన్స్పెక్టర్. కిట్టు ఈసారి మరో దాదాతో మాట్లాడుకుని ఆమె సోదరుని అపహరించి కాపాడటానికి ప్రయత్నిస్తున్నట్లు నాటకం ఆడతాడు.

తారాగణం 
 కృష్ణమూర్తి అలియాస్ కిట్టుగా జగపతి బాబు
 ఝాన్సీగా సౌందర్య
 భవానిగా రంభ
 అతిథి పాత్రలో రమ్యకృష్ణ
 జోగేశ్వరి దేవిగా కాంచన్
 చంద్రారావు అలియాస్ చంద్రంగా సుధాకర్
 అహోబిలంగా బ్రహ్మానందం

మూలాలు 

బ్రహ్మానందం నటించిన సినిమాలు
అల్లరి ప్రియుడు, 1993లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలయిన ఒక తెలుగు సినిమా. ఇందులో రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆర్. కె. ఫిల్ం అసోసియేట్స్ పతాకంపై కె. కృష్ణమోహనరావు నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.

కథ
ఇందులో కథానాయకుడు రాజశేఖర్ ఒక గాయకుడు. అతడు ఒక కవయిత్రి పాటలను గానం చేస్తూ ప్రసిద్ధుడవుతాడు. అదే సమయంలో ఆమెను ప్రేమిస్తాడు. ఆయితే ఆ అసలు రచయిత్రి రమ్యకృష్ణ కాగా ఆమె తన చెల్లెలు మధుబాలవే రచయిత్రిగా రాజశేఖర్‌కు పరిచయం చేస్తుంది. అలా ఇద్దరమ్మాయిలు, ఒకబ్బాయి మధ్య నడచిన ముక్కోణపు ప్రేమయే ఈ సినిమా కథాంశం. సినిమాలో పాటలు బాగా విజయవంతమయ్యాయి.

తారాగణం 
 రాజశేఖర్
 రమ్యకృష్ణ
 మధుబాల
 రావు గోపాలరావు
 బ్రహ్మానందం
 మనోరమ
 రవితేజ
 చిట్టిబాబు
 శ్రీహరి
 సుధాకర్

పాటలు 
 రోస్ రోస్ రోస్ రోజాపువ్వా - రచన:వేటూరి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం 
 అందమా నీ పేరేమిటి - రచన:వేటూరి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం
 ప్రణయమా నీ పేరేమిటి- రచన:వెన్నెలకంటి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం
 ఏం పిల్లది ఎంత మాటన్నది - - రచన:కీరవాణి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
 ఉత్తరాల ఊర్వశి - రచన:వేటూరి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
 అహో ఒక మనసుకు నేడే - రచన:సీతారామ శాస్త్రి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
 చెప్పకనే చెబుతున్నది - రచన:భువనచంద్ర, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు 

రావు గోపాలరావు నటించిన చిత్రాలు
బ్రహ్మానందం నటించిన సినిమాలు
కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రాలు
అల్లరి వయసు 1979లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ ఫిల్మ్స్ పతాకంపై వెంకట సుబ్బారావు, పి.పి.అబ్దుల్లాలు నిర్మించిన ఈ సినిమాకు జగపతి రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, జయచిత్ర ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.

చెల్లెలి కాపురం సినిమాలోని "చరణ కింకిరులు ఘల్లుఘల్లుమన" పాటను ఎం.బాలయ్య అనుమతితో ఈ చిత్రంలో ఉపయోగించారు.

తారాగణం 

 మురళీమోహన్
 జయచిత్ర
 కాంతారావు
 అల్లురామలింగయ్య
 నగేష్
 రమాప్రభ
 కాకరాల
 హరిబాబు
 జయకుమార్
 అంజాద్ కుమార్
 కృష్ణప్రియ
 కొంగర జగ్గయ్య

సాంకేతిక వర్గం 

 నిర్మాతలు: కోపూరు వెంకట సుబ్బారావు, పిపి అబ్దుల్లా
 కథ, దర్శకుడు: జగపతి రాజశెఖర్
 బ్యానర్: లక్ష్మీ పిలింస్ 
 సమర్పణ: కళ్యాణచిత్ర
 మాటలు: అప్పలాచార్య
 చిత్రానువాదం: కళ్యాణ చిత్ర యూనిట్
 పాటలు: ఆత్రేయ, వేటూరి, కొసరాజు, గోపి
 నేపథ్యగాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, బి.వసంత, జి.ఆనంద్, శోభాశేఖర్
 స్టిల్స్: జయకుమార్, కె.ఎస్.మణి
 స్టంట్: అంబూరు బాబు
 కళ: కొండపనేని రామలింగేశ్వరరావు
 కూర్పు: గౌతంరాజు
 కెమేరా: బాబూరావు
 సంగీతం: జె.వి.రాఘవులు
 విడుదల: 1979 డిసెంబరు 11

మూలాలు

బాహ్య లంకెలు 
 

అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు
కాకరాల నటించిన సినిమాలు
జె.వి.రాఘవులు సంగీతం అందించిన సినిమాలు
అల్లరి పిల్ల, కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన 1992 నాటి తెలుగు సినిమా. చిత్రానువాదం గణేష్ పాత్రో రాశాడు. ఇది 1991 లో అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రం కిళుక్కుం కు రీమేక్. ఆ సినిమాను హిందీలో కూడా ముస్కురాహట్ పేరుతో పునర్నిర్మించారు.  తన తండ్రిని వెతుక్కుంటూ తిరుపతికి వచ్చే అనాథ నందిని (మీనా) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తిరుపతిలో ఆమె టాక్సీ డ్రైవర్ కమ్ టూరిస్ట్ గైడ్ రాజు (సురేష్) అతని స్నేహితుడు (చిన్న) ను కలుస్తుంది. ఇందులో కైకాల సత్యనారాయణ, చిదతల అప్పారావు, ఈశ్వరరావు కీలక పాత్రల్లో నటించారు. ఇది భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్  పతాకంపై ఎస్. గోపాలారెడ్డి నిర్మించిన 13 వ చిత్రం. బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందింది.

కథ 
రాజు (సురేష్) టాక్సీ డ్రైవర్ కమ్ టూరిస్ట్ గైడ్. పిచ్చిదైన నందిని (మీనా) తిరుపతిలో అతడికి తటస్థపడుతుంది. అప్పుటి నుండి  రాజు, అతని స్నేహితుడు నేత్రానందం (చిన్న) జీవితాలలో ఆమెతో ముడిపడి వరుసగా అనేక సంఘటనలు జరుగుతాయి. సినిమా ప్రారంభంలో, నందినిని వదిలించుకోవడానికి వారి పడే తిప్పలు ప్రేక్షకులను నవ్విస్తాయి. అయితే, ఆమె తప్పించుకున్న మానసిక రోగి అనీ, ఆమెను సురక్షితంగా తిరిగి అప్పగించిన వారికి బహుమానం ఉందనీ వాళ్ళు తెలుసుకుంటారు.ఈ బహుమానం రోజులు గడిచే కొద్దీ పెరుగుతుందని కూడా వాళ్ళిద్దరూ తెలుసుకుంటారు. ఆమెను కొన్నాళ్ళు దాచి ఉంచి, ఆ తరువాత అప్పగిస్తే ఎక్కువ బహుమానం పొందవచ్చని భావించి, నందినిని కొంతకాలం దాచాలని నిర్ణయించుకుంటారు. 

ఆమె పొడవాటి జుట్టును పొట్టిగా కత్తిరించి వారు ఆమె రూపాన్ని కూడా మారుస్తారు. నందిని తన అసలు కథను రాజుకు చెబుతుంది. ఆమెకు తల్లి వరీ తెలియదు. తండ్రి రిటైర్డ్ జస్టిస్ పుండరీకం (కైకాల సత్యనారాయణ).  కానీ అనాథాశ్రమంలో పెరుగుతుంది. అనాథాశ్రమంలో ఉండగా ఆమెను చూసేందుకు వచ్చే  జస్టిస్ (కైకాల సత్యనారాయణ) ను "స్వీట్ మ్యాన్" అని పిలిచేది. అప్పటికి  అతనే తన తండ్రి అని ఆమెకు తెలియదు. ఆ వాస్తవం తెలుసుకున్న తరువాత, ఆమె తన వార్డెన్ దగ్గరి నుండి తన తండ్రి చిరునామా తీసుకుని  అతడిని చూడటానికి వెళుతుంది. ఆమె తండ్రి ఉండడు. పుండరీకం కొడుకులు కోడళ్ళూ ఆమెకు మాదకద్రవ్యాలు అలవాటు చేసి, మానసిక చికిత్సా ఆశ్రయానికి పంపుతారు. ఆమె ఆ ఆశ్రయం నుండి తప్పించుకుని రాజును కలుసుకుంది.

రాజు నందినికి సహాయం చేస్తానని వాగ్దానం చేసి, తన తండ్రి ఇంటిలో గృహిణిగా నియమిస్తాడు. కాలక్రమంలో, అక్కడి విషయాలు పైకి కనిపించే విధంగా లేవని వారు గ్రహిస్తారు. మరిన్ని సమస్యలు బయటపడతాయి.

తారాగణం 

 రాజుగా సురేష్
 నందినిగా మీనా
 నేత్రానందం, ఫోటోగ్రాఫర్ గా చిన్న
 రిటైర్డ్ జస్టిస్ పుండారికం గా కైకాల సత్యనారాయణ
 కుప్పుస్వామి, సేవకుడిగా చిదతాలా అప్పారావు
 న్యాయమూర్తి పెద్ద కొడుకు లాయర్ గా ఈశ్వర రావు
 రాజకేశ్వరిగా సూర్యకాల, న్యాయమూర్తి పెద్ద కుమార్తె
 న్యాయమూర్తి వికలాంగ కుమార్తె అయిన శాంతిగా లాతాశ్రీ
 పాఠశాల ఉపాధ్యాయురాలిగా కల్పనా రాయ్
 ఫణి
 జగ్గు

సంగీతం 
సినిమా లోని పాటలను విద్యాసాగర్ స్వరపరిచాడు. సాహిత్యాన్ని వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ అందించాడు.

మూలాలు 

సురేష్ నటించిన చిత్రాలు
మీనా నటించిన చిత్రాలు
సత్యనారాయణ నటించిన చిత్రాలు
హాస్య చిత్రాలు
కల్పనా రాయ్ నటించిన సినిమాలు
అల్లరోడు 1994లో విడుదలైన తెలుగు సినిమా. అమూల్యా ఆర్ట్స్ పతాకంపై ఎం.ఎ. గపూర్, పి.పురుషోత్తమ రావులు నిర్మించిన ఈ సినిమాకు కె.అజయ్ కుమార్ దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, సురభి, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయవంతం కాలేదు.

కథ 
కృష్ణ మూర్తి (రాజేంద్ర ప్రసాద్) విలాస పురుషుడు. ఎప్పుడూ అమ్మాయిలతో సరసాలాడుతుంటాడు. అతని భార్య సత్యభామ (సురభి) అతన్ని నిరోధిస్తుంది. కొన్ని హాస్య సంఘటనల తరువాత, ఒక రాత్రి, భామ లేనప్పుడు, కృష్ణ మూర్తి తన కారులో పోతూ జయంతి (లతా శ్రీ) అనే గర్భిణీ స్త్రీని గుర్తించాడు. అతను ఆమెకు ఆశ్రయం ఇస్తాడు,, ఆమె ఒక మగ పిల్లవాడిని ప్రసవించింది. ఒక రోజు కృష్ణ మూర్తి కార్యాలయం నుండి తిరిగి వచ్చినప్పుడు జయంతి చనిపోయినట్లు గుర్తించాడు. అదే సమయంలో, కృష్ణ మూర్తి యొక్క ప్రాణ స్నేహితుడు ఇన్స్పెక్టర్ రవి (కె. నాగ బాబు) ప్రవేశించి మృతదేహాన్ని గుర్తించాడు. కృష్ణ మూర్తిని నిర్దోషిగా ధ్రువీకరిస్తూ, అతను ఆ మృతదేహాన్ని పాతిపెట్టమని సలహా ఇస్తాడు. కొన్ని రోజుల తరువాత భామ ఇంటికి చేరుకున్నప్పుడు కృష్ణ మూర్తి శిశువును తన స్నేహితుడి బిడ్డగా చెబుతాడు. ఆ బిడ్డ తల్లిదండ్రులు ప్రమాదంలో మరణించారని చెప్తాడు. ప్రస్తుతం కృష్ణమూర్తిని జయంతికి సంబంధించి నాయుడు (నిజాల్గల్ రవి) అనే వ్యక్తి వెంటాడాడు. వెంటనే అతను రవికి సమాచారం ఇస్తాడు, ఆ ఊబిలోని శవాన్ని మార్చేందుకు కృష్ణమూర్తి ప్రయత్నం చేసే సమయంలో అతను పోలీసులకు పట్టుబడతాడు. జైలులో నాయుడు ఒక సి.బి.ఐ అధికారిగా పరిచయమై జయంతి రవి భార్య అని చెబుతాడు. ఇప్పుడే, కృష్ణ మూర్తి రవిని జయంతిని హత్యచేసాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. వెంటనే, అదృష్టవశాత్తూ, భామ రవి,జయంతి యొక్క వివాహ వీడియో క్యాసెట్‌ను వెలికితీస్తుంది. దాని గురించి తెలుసుకున్న రవి, భామాను కూడా కొట్టడానికి ప్రయత్నిస్తాడు. చివరికి, ఆమెను కృష్ణ మూర్తి రక్షించుకుంటాడు. నాయుడు రవిని తొలగిస్తాడు. చివరగా, ఈ జంట తిరిగి కలుసుకోవడంతో సినిమా సంతోషకరమైన పరిస్థితులలో ముగుస్తుంది.

నటీనటులు
 రాజేంద్రప్రసాద్
 సురభి
 బ్రహ్మానందం
 నిళల్‌గల్ రవి
 నాగేంద్రబాబు
 మల్లిఖార్జునరావు
 సిల్క్ స్మిత
 తనికెళ్ల భరణి
 వై విజయ
 లతాశ్రీ
 కళ్ళు చిదంబరం

సాంకేతిక వర్గం 

 కథ: రమణి
 సంభాషణలు: మరుదూరు రాజా
 పాటలు: భువనచంద్ర

మూలాలు

బయటి లింకులు
 అల్లరోడు సినిమా వివరాలు.

రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు
బ్రహ్మానందం నటించిన సినిమాలు
సిల్క్ స్మిత నటించిన సినిమాలు
అల్లావుద్దీన్ అద్భుతదీపం 1957 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని ఒకేసారి తమిళంలో "అల్లావుద్దీన్ అర్పుత విళక్కుం" పేరుతోను, హిందీలో "అల్లాడిన్ కా చిరాగ్" అనే పేరుతోను నిర్మించారు.

నటీనటులు
 అక్కినేని నాగేశ్వరరావు - అల్లావుద్దీన్
 అంజలీదేవి - యాస్మిన్ బేగం, రాజకుమారి
 ఎస్.వి.రంగారావు - జాఫర్, మాంత్రికుడు
 టి.ఎస్.బాలయ్య 
 రేలంగి వెంకట్రామయ్య - సయ్యద్
 రాజసులోచన - సితార, నాట్యకత్తె
 జి.శకుంతల

పాటలు
 అందాల కోనేటిలోన సాగింది స్వప్నాల - పి.సుశీల, ఎ. ఎం. రాజా 
 జమక్ జమక్ జమ జమక్ జమక్ జమ్మని ఆడండి జగాన - పి.సుశీల బృందం
 తమాష దీపం నవీన దీపం బిరాన కావాలా నిజంగా లభించు - పిఠాపురం నాగేశ్వరరావు
 మనసంతా నీదిరా వలపంతా నీదిరా - పి.సుశీల 
 నిన్ను వలచి ఎన్నెన్నో తలచి ఉన్నాను నేను - పి.సుశీల బృందం 
 పిల్లాలంగడి పిల్లాలంగడి అందాల - వి.సత్యారావు, పి.సుశీల, స్వర్ణలత 
 పిల్లాపిల్లా రా పెళ్ళిచేసుకో ఎలాగైనా పిల్లాదానా - పి.సుశీల 
 సొగసరిదాననయ్య రంగేళి సింగారి - కె.రాణి, పి.బి.శ్రీనివాస్ 
 వచ్చాను నీకోసమే వగలు తెచ్చాను నీకోసమే - జిక్కి 
 యవ్వనమొకటే కవ్వించేది నవ్వుతు నీవు సాగితే - ఎ.పి. కోమల

వనరులు
 తెలుగు సినిమా పాటలు బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్) - సంకలనంలో సహకరించినవారు: జె. మధుసూదనశర్మ
 ఘంటసాల గళామృతంలో అల్లావుద్దీన్ అద్భుతదీపం సినిమా పాటల వివరాలు.

అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు
రేలంగి నటించిన సినిమాలు
రాజసులోచన నటించిన సినిమాలు
ఎస్.వి.రంగారావు  నటించిన సినిమాలు
అల్లుడా మజాకా  ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో 1995 లో విడుదలైన చిత్రము. ఇందులో చిరంజీవి, రమ్యకృష్ణ, రంభ, ఊహ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై దేవివరప్రసాద్ నిర్మించాడు. కోటి సంగీత దర్శకత్వం వహించాడు. పోసాని కృష్ణమురళి చిత్రానువాదం సమకూర్చాడు. ఈ సినిమా కిలాడీ అనే పేరుతో కన్నడలో పునర్నిర్మాణం చేసారు.

ఈ సినిమా విడుదల కావడంతోటే ఇందులో మహిళలను అభ్యంతరకరంగా చూపించారంటూ కమ్యూనిస్టులు, హిందూ జాతీయ వాదులు నిషేధించాలని కోరారు. సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత సెన్సారు బోర్డు వారు ఈ చిత్రాన్ని నిషేధించగా, అందుకు వ్యతిరేకంగా చిరంజీవి అభిమాన సంఘాలు హైదరబాదులో ధర్నా నిర్వహించారు. దాంతో వారు నిషేధాన్ని వెనక్కు తీసుకుని సినిమాలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు తీసివేసి ప్రదర్శించవచ్చని అనుమతి ఇచ్చారు.

కథ 
సీతారాముడు తండ్రి ముప్ఫై ఏళ్ళుగా ఊరికి పంచాయితీ ప్రెసిడెంటుగా పనిచేస్తుంటాడు. వీరి కుటుంబాన్నే కాక ఊళ్ళో వారందరినీ అదే ఊళ్ళో ఉన్న వసుంధర ఆమె సోదరుడు పెద్దయ్య వేధిస్తూ ఉంటారు. పెద్దయ్య కొడుకు శివ విదేశాల్లో చదువుకుని ఆ ఊరికి వస్తాడు. పెద్దయ్య శివని వసుంధర పెద్ద కూతురు పప్పిని వివాహం చేసుకోమని కోరితే అతను మాత్రం పొగరుబోతు అమ్మాయైన పప్పిని కాదని అణకువైన అమ్మాయియైన సీతారాముడి చెల్లెలు మల్లీశ్వరిని ప్రేమిస్తాడు. సీతారాముడి తండ్రి తన భూమిని సాగుకోసం పేదలకు పంచి పెట్టి ఉంటాడు. ఆ భూముల్లో అపారమైన గ్రానైటు నిక్షేపాలున్నాయని తెలుసుకున్న పెద్దయ్య సంబంధానికి ఒప్పుకొని ఆ భూమిని తన కొడుక్కొ కట్నంగా ఇవ్వమంటాడు. సీతారాముడి తండ్రి అందుకు అంగీకరించడు. పెద్దయ్య వివాహాన్ని రద్ధు చేయిస్తాడు. వసుంధర కూడా శివ తన కూతుర్ని కాదని మల్లీశ్వరిని ప్రేమించినందుకు అతడి మీద కోపంగా ఉంటుంది. కూలీలను మోసం చేసి వారి భూములను స్వాధీనం చేసుకుంటుంది వసుంధర. పెద్దయ్యతో మాట్లాడి శివకు చెప్పకుండా అతని వివాహాన్ని పప్పితో నిర్ణయిస్తారు. అదే లోపు మల్లీశ్వరి శివ వల్ల గర్భవతి అయిందని తెలుస్తుంది. కూలీల భూములు అన్యాక్రాంతం అయిపోయినందుకు సీతారాముడి తండ్రి విచారంతో ఆత్మహత్య చేసుకుంటాడు.

శివ కోసం ఎదురు చూస్తూ సీతారాముడు, మల్లీశ్వరి పట్నం చేరుకుంటారు. శివ తిరిగి రాగానే అతని కళ్ళెదురుగా మల్లీశ్వరిని వ్యభిచారం కేసులో ఇరికిస్తారు వసుంధర, పెద్దయ్యలు. శివ ఆమెను దగ్గరకు రానీయడు. పెద్దయ్య సీతారాముడిని ఒక పోలీసు అధికారి హత్య కేసులో ఇరికించి మరణశిక్ష పడేలా చేస్తాడు. అతను జైలు నుంచి తప్పించుకుని శివను పెళ్ళి చేసుకోబోతున్న పప్పిని బలవంతంగా పెళ్ళి చేసుకుంటాడు. ఎప్పుడో వదిలేసిన వసుంధర భర్త లాయరు శివరామకృష్ణ సహాయంతో సీతారాముడు పెరోల్ మీద బయటకు వస్తాడు.

తారాగణం 
 సీతారాముడుగా చిరంజీవి
 పప్పీగా రమ్యకృష్ణ, వసుంధర పెద్ద కూతురు
 రంభ
 మల్లీశ్వరిగా ఊహ, సీతారాముడి చెల్లెలు
 వసుంధరగా లక్ష్మి
 పెద్దయ్యగా కోట శ్రీనివాసరావు
 బ్రహ్మానందం
 లాయరు శివరామకృష్ణగా గిరిబాబు, వసుంధర భర్త
 మల్లికార్జునరావు
 శివగా చిన్నా, వసుంధర కొడుకు
 శ్రీహరి
 అల్లు రామలింగయ్య
 ఎ. వి. ఎస్
 చలపతిరావు
 మహేష్ ఆనంద్

సంగీతం 
ఈ సినిమాకు కోటి సంగీత దర్శకత్వం వహించాడు.

మూలాలు

చిరంజీవి నటించిన సినిమాలు
1995 తెలుగు సినిమాలు
ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిత్రాలు
కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
బ్రహ్మానందం నటించిన సినిమాలు
అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు
అల్లుడే మేనల్లుడు పద్మశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వి.వెంకటేశ్వర్లు నిర్మించిన తెలుగు కుటుంబకథా చిత్రం. పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 1970, నవంబరు 5న విడుదలయ్యింది.

తారాగణం

సాంకేతిక వర్గం

కథా సంగ్రహం
జమీందారు ప్రసాద్‌కు కమల అనే చెల్లెలు ఉంటుంది. ఆమె ఒక సామాన్యుని ప్రేమించి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతుంది. ఆమెకు చంద్రం అనే కొడుకు పుడతాడు. ఆమె తన అవసాన దశలో ఆదుకొమ్మంటూ అన్నకు ఉత్తరం వ్రాస్తుంది. చెల్లెలంటే అమితమైన ప్రేమాభిమానాలు కలిగిన ప్రసాద్‌కు చెల్లెలు వ్రాసిన ఉత్తరం, తన భార్య విశాలాక్షి మూలంగా చాలా ఆలస్యంగా అందుతుంది. చెల్లెల్ని ఆదుకోవాలని వెళ్ళిన ప్రసాద్‌కు చెల్లెలు దొరకదు, మేనల్లుడు దొరకడు. కమల అంతకుముందు చనిపోతూ తన తోడి కోడలు జానకికి తన కొడుకును అప్పగిస్తుంది. జానకి చంద్రాన్ని తన ఊరు తీసుకుపోయి భర్తకు ఇష్టం లేకపోయినా కొడుకు రంగన్నతో సమానంగా పెంచుతుంది. తన మేనల్లుడి కోసం ఎంత ఖర్చయినా వెదికించి అతడినే కూతురు సరోజకు భర్తగా చేస్తానని ప్రసాద్ పంతం పడతాడు. అక్కడ జానకి కొడుకు తాను చేసిన తప్పులన్నింటినీ చంద్రంమీద బనాయిస్తూ ఉంటాడు. ఐతే ఒకానొక సంఘటనలో రంగన్న జైలుకు పోవలసి వస్తుంది. జానకి భర్త చంద్రాన్ని ఇంటి నుండి వెళ్ళగొడతాడు. చంద్రం విజయవాడ వెళ్తూ దారిలో సోడా మరిడయ్య, సుందరవదనంలను కలుసుకుంటాడు. ఈ సుందర వదనం ప్రసాద్‌కు, లక్ష్మికి పుట్టిన బిడ్డ. లక్ష్మి అన్నయ్య నాగులు ప్రసాద్‌ను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతుంటాడు. చంద్రం విజయవాడ చేరుకుని సోడాలు అమ్ముతూ, విశాలాక్షి ఇంటిలో పనికి కుదురుతాడు. విశాలాక్షి కూతురు సరోజ, చంద్రం ప్రేమించుకుంటారు. జైలు నుండి బయటకు వచ్చిన రంగన్నను నాగన్న ప్రసాద్ మేనల్లునిగా చూపించి ప్రసాద్ ఆస్తిని కొల్లగొట్టడానికి పన్నాగం పన్నుతాడు. రంగన్నే తన మేనల్లుడని ప్రసాద్ నమ్మి సరోజకు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. సరోజ చంద్రాన్ని ప్రేమిస్తుందన్న విషయాన్ని గ్రహించిన ప్రసాద్ చంద్రాన్ని బెదిరించి, డబ్బు ఆశ చూపించి, చివరకు బ్రతిమాలుతాడు. దాంతో చంద్రం సరోజకు తనపై అసహ్యం కలిగేలా ప్రవర్తించి ఎక్కడికో వెళ్ళిపోతాడు. నాగన్న చంద్రాన్ని బంధించి రంగన్నను వివాహం చేసుకోకపోతే అతడిని చంపేస్తానని సరోజను బెదిరిస్తాడు. పతాక సన్నివేశంలో ప్రసాద్ తన మేనల్లుడిగా చంద్రాన్ని గుర్తించి, తన చెల్లెలికి చేసిన ప్రమాణాన్ని నెగ్గేలా చంద్రం సరోజల వివాహం జరిపించి కథను సుఖాంతం గావిస్తాడు.

పాటలు
ఈ చిత్రంలోని పాటలకు బి.శంకర్ బాణీలు కట్టాడు.

మూలాలు

బయటి లింకులు
 
పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన సినిమాలు
కృష్ణంరాజు నటించిన సినిమాలు
సూర్యకాంతం నటించిన సినిమాలు
ధూళిపాళ నటించిన చిత్రాలు
ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు
సత్యనారాయణ నటించిన చిత్రాలు
కాకరాల నటించిన సినిమాలు
రమాప్రభ నటించిన చిత్రాలు
అల్లుడు కోసం 1987లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రఘునాథ కళా చిత్ర పతాకంపై బచ్చల రమణయ్య నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్.కోటరెడ్డి దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, కల్పన ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్ని అందించాడు.

తారాగణం 

 చంద్రమోహన్
 కల్పన
 సత్యనారాయణ
 నూతన్ ప్రసాద్
 రాళ్లపల్లి
 సుత్తివేలు
 రావి కొండలరావు
 కాకరాల
 చిట్టిబాబు 
 రాంబాబు
 గణేశ్వరరావు
 సత్యం
 థమ్
 సిల్క్ స్మిత

సాంకేతిక వర్గం 

 సమర్పణ:బి.వి.రెడ్డి
 బ్యానర్: రఘునాథ్ కళా చిత్ర
 కథ, మాటలు: కాశీ విశ్వనాథ్
 పాటలు: సి.నారాయణరెడ్డి
 నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, శోభారాజ్
 నృత్యాలు: చిన్నా
 ఆర్ట్: కృష్ణమూర్తి
 స్టిల్స్: కె.శంకర్
 కూర్పు: కె.రామగోపాలరెడ్డి
 ఛాయాగ్రహణం: డి.డి.ప్రసాద్
 సంగీతం: చెళ్ళపిళ్ల సత్యం
 నిర్మాత: బచ్చల రమణయ్య
 దర్శకుడు: ఎం.ఎస్.కోటరెడ్డి

మూలాలు

బాహ్య లంకెలు 
 

నూతన్ ప్రసాద్ నటించిన చిత్రాలు
సుత్తి వేలు నటించిన సినిమాలు
సత్యనారాయణ నటించిన చిత్రాలు
రాళ్ళపల్లి నటించిన సినిమాలు
కాకరాల నటించిన సినిమాలు
చంద్రమోహన్ నటించిన సినిమాలు
సిల్క్ స్మిత నటించిన సినిమాలు
అల్లుడి పోరు అమ్మాయి జోరు 1994లో విడుదలైన తెలుగు సినిమా. శివసాయి ఫిల్మ్స్ పతాకంపై కొడాలి అనిత నిర్మించిన ఈ సినిమాకు ఎ.పి.చంద్ర దర్శకత్వం వహించాడు. సుమన్, వినీత, సుధాకర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు.

తారాగణం 

 సుమన్
 వినీత
 సుధాకర్
 బ్రహ్మానందం

సాంకేతిక వర్గం 

 దర్శకత్వం: ఎ.పి.చంద్ర
 స్టూడియో: శివసాయ్ ఫిల్మ్స్
 నిర్మాత: కొడలి అనిత; 
 స్వరకర్త: రాజ్-కోటి
 విడుదల తేదీ: 1994 ఫిబ్రవరి 17
 సమర్పించినవారు: పి. రామిరెడ్డి; సహ నిర్మాత: నవవాడ విజయంద్ర, జి. నాగేష్

పాటలు
చుక్కల తోట చక్కని పాట - ఎస్.పి.బాలసుబ్రమణ్యం
ఐసలకిడి గుంతలకిడి అమ్మాయో - ఎస్.పి.బాలసుబ్రమణ్యం, కె.ఎస్.చిత్ర
కోనసీమా కోయిలమ్మా - ఎస్.పి.బాలసుబ్రమణ్యం, కె.ఎస్.చిత్ర
పెళ్ళికి మేళం - శైలజ
వానా వానా రావమ్మ - ఎస్.పి.బాలసుబ్రమణ్యం, కె.ఎస్.చిత్ర

మూలాలు

బాహ్య లంకెలు 

 

తెలుగు సినిమా
బ్రహ్మానందం నటించిన సినిమాలు
అల్లుడొచ్చాడు పి.ఎ.పి. పతాకంపై ప్రత్యగాత్మ దర్శకునిగా నిర్మించిన 1976 నాటి తెలుగు సాంఘిక చిత్రం.

కథ 
కమ్మటి పాటలకు పెట్టింది పేరు చంద్రశేఖరం. అతను గాయకుడిగా పెట్టుకున్న పేరు రవి. రవి పాటలంటే ప్రాణం శ్రీదేవికి. కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకున్న విశాఖరావు పెళ్ళి చెయ్యాలనుకుంటాడు. పెళ్ళి సంబంధాలు, హడావిడి లేకుండా విశాఖరావు ఒక ఫోన్ చేసేసరికి అల్లుడొచ్చాడు.

అతని పేరు చంద్రశేఖరమని, తన స్నేహితుడి కుమారుడని, చదువుకున్నవాడని, బుద్ధిమంతుడని విశాఖరావు అభిప్రాయం.

అతని ముద్దుపేరు రవి. రేడియోలో అధ్బుతంగా పాటలు పాడే గాయకుడని కాబోయే పెళ్ళి కుమార్తె శ్రీదేవి అభిప్రాయం.

అంతా దైవ సంకల్పం. ఎక్కదివాడినో ఇక్కడికొచ్చి పడ్డాను. అమ్మాయి బాగుంది. అయితే పాటలు పాడమని ప్రాణాలు తీస్తుంది. తనకు పాటలు పాడడం రాదు. ఎలాగో పాట గండం తప్పించుకుని ఎప్పతి కప్పుడు నాటకమాడేస్తే సరిపోతుందని రవి అభిప్రాయం.

వీడు మహా కేటుగాడు. తన పేరు పెట్టేసుకొని విశాఖరావు ఇంట్లో తిష్ట వేసాడు. వీడు దగుల్బాజీ... ఇది చంద్రశేఖరరావు అభిప్రాయం.

కొంతకాలం తర్వాత ఇద్దరూ ఏకమైపోయి విశాఖరావు ఇంట్లో నాటకమాడటం ప్రారంభించారు. రవి దేవిని ప్రేమించి, అందుకు అవసరమైన కొన్ని పాటలు పాడాడు. శేఖర్ సరోజ అనే అమ్మాయిని ప్రేమించి అమెను దక్కించుకొనేందుకు రవితో చేతులు కలిపాడు. కొంతకాలానికి సరోజ తండ్రిని చంపి వజ్రాలు కాజేసిన వ్యక్తి పేరు శేఖర్ అని తెలుస్తుంది. అక్కడ కథ మలుపు తిరుగుతుంది.

తారాగణం 

 రామకృష్ణ
 జయసుధ
 రాజబాబు
 కృష్ణకుమారి
 నాగభూషణం
 అల్లురామలింగయ్య
 గోకిన రామారావు
 సాక్షి రంగారావు
 గణేష్ పాత్రో
 చిట్టిబాబు
 సారథి
 అశోక్ కుమార్
 మోదుకూరి సత్యం
 ఝాన్సీ, 
 సె.హెచ్.వరలక్ష్మి
 జయమాలిని
 ప్రకాష్

సాంకేతిక వర్గం 

 సంభాషణలు: భమిడిపాటి రాధాకృష్ణ, గణేష్ పాత్రో
 పాటలు: ఆత్రేయ, కొసరాజు, దాశరథి, నారాయణరెడ్డి
 చిత్రానువాదం, సంగీతం: తాతినేని చలపతిరావు
 నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
 దుస్తులు: యం.కె.రామారావు
 స్టిల్స్: ఎం.సత్యం
 మేకప్: కె.నరసింహారావు, రాము, సుబ్బయ్య
 నృత్యం: తార
 కళ: జి.వి.సుబ్బారావు
 కూర్పు: జె.కృష్ణస్వామి, బాలు
 ఆపరేటివ్ ఛాయాగ్రహణం: హరనాథ్, శర్మ
 ఛాయాగ్రహణం: పి.యస్.సెల్వరాజ్
 నిర్మాత: ఎ.వి.సుబ్బారావు
 దర్శకత్వం: కె.ప్రత్యగాత్మ

నిర్మాణం

చిత్రీకరణ 
సినిమాలోని పాటల చిత్రీకరణ మహాబలిపురంలో జరిగింది.

పాటలు 
 కొడితే పులినే కొట్టాలిరా

మూలాలు 

అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు
జయసుధ నటించిన సినిమాలు
జయమాలిని నటించిన సినిమాలు
టి.చలపతిరావు సంగీతం అందించిన సినిమాలు
అల్లుడు దిద్దిన కాపురం 1991, ఆగస్టు 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. పద్మావతి ఫిల్మ్స్ పతాకంపై యు. సూర్యనారాయణ బాబు నిర్మాణ సారథ్యంలో కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, శోభన, మోహన్‌బాబు, బి.సరోజాదేవి, గొల్లపూడి మారుతీరావు, కాంతారావు, ప్రభాకర రెడ్డి తదితరులు నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు. ఈ చిత్రానికి ప్రతికూల స్పందనలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద చిత్రం పరాజయం పొందింది.

నటవర్గం 

 ఘట్టమనేని కృష్ణ
 శోభన
 మోహన్ బాబు
 బి. సరోజా దేవి
 మానస
 శివకృష్ణ
 ప్రభాకర రెడ్డి
 కాంతారావు
 గొల్లపూడి మారుతీరావు
 గిరిబాబు
 డిస్కో శాంతి
 అశోక్ కుమార్
 దేవదాస్ కనకాల

సాంకేతికవర్గం 
 దర్శకత్వం: ఘట్టమనేని కృష్ణ
 నిర్మాత: యు. సూర్యనారాయణ బాబు
 రచన: జంధ్యాల, కృష్ణ
 సంగీతం: కె. చక్రవర్తి
 ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్. స్వామి
 కూర్పు: కృష్ణ
 నిర్మాణ సంస్థ: పద్మావతి ఫిల్మ్స్

పాటలు 
ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సి. నారాయణ రెడ్డి పాటలు రాశారు.

మూలాలు

ఇతర లంకెలు 

1991 తెలుగు సినిమాలు
ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
శోభన నటించిన చిత్రాలు
గొల్లపూడి మారుతీరావు చిత్రాలు
మోహన్ బాబు నటించిన చిత్రాలు
ప్రభాకర్ రెడ్డి నటించిన చిత్రాలు
కాంతారావు నటించిన చిత్రాలు
గిరిబాబు నటించిన చిత్రాలు
తెలుగు కుటుంబకథా చిత్రాలు
డిస్కో శాంతి నటించిన సినిమాలు
బి.సరోజాదేవి నటించిన సినిమాలు
అల్లుడు గారూ జిందాబాద్ 1981లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సుమన్ క్రియేషన్స్ పతాకంపై ఎం.శ్యామలారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కట్టా సుబ్బారావు కథ, చిత్రానువాదం, దర్శకత్వ వహించాడు. శోభన్ బాబు, శారద ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.

తారాగణం 

 శోభన్ బాబు
 శారద
 గీత
 గుమ్మడి వెంకటేశ్వరరావు
 రమణమూర్తి
 పి.ఎల్.నారాయణ
 కాకరాల
 సువర్ణ
 మమత
 శ్యామల
 జయమాలిని
 సత్యనారాయణ
 ప్రభాకరరెడ్డి
 మాడా

సాంకేతిక వర్గం 

 బ్యానర్: సుమన్ క్రియేషన్స్
 మాటలు: గొల్లపూడి మారుతీరావు
 పాటలు: వేటూరి సుందరరామమూర్తి
 నేపథ్యగానం: మాధవపెద్ది రమేష్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
 నృత్యాలు: తార
 పోరాటాలు: పరమశివ, రాజు
 కళ: భాస్కరరాజు
 స్టిల్స్: పి.ఎస్.మూర్తి
 ఆపరేటివ్ ఛాయాగ్రహణం: సి.గోపాలరావు
 కూర్పు: నరసింహారావు
 సంగీతం: చక్రవర్తి
 ఛాయాగ్రహణం: పి.చంగయ్య
 నిర్మాత: ఎం.శ్యామలారెడ్డి
 కథ, చిత్రానువాదం, దర్శకుడు: కట్టా సుబ్బారావు

మూలాలు

బాహ్య లంకెలు 
 

శోభన్ బాబు నటించిన సినిమాలు
గుమ్మడి నటించిన చిత్రాలు
సత్యనారాయణ నటించిన చిత్రాలు
పి.ఎల్.నారాయణ నటించిన సినిమాలు
కాకరాల నటించిన సినిమాలు
జయమాలిని నటించిన సినిమాలు
గీత నటించిన సినిమాలు
అల్లుడు పట్టిన భరతం 1980లో విడుదలైన తెలుగు సినిమా. డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై డి.వి.ఎస్.రాజు నిర్మించిన ఈ సినిమాకు కె.విశ్వనాథ్ దర్శకత్వ వహించాడు. కృష్ణం రాజు, జయసుధ, నూతన్ ప్రసాద్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.

నటీనటులు
 కృష్ణంరాజు
 జయసుధ
 నూతన్‌ ప్రసాద్
 కవిత
 అల్లు రామలింగయ్య
 రమాప్రభ
 రంగనాథ్
 నాగభూషణం
 పద్మనాభం
 నిర్మల
 పి.ఎల్.నారాయణ
 మిక్కిలినేని
 భీమరాజు
 జి.ఎన్.స్వామి
 పుష్పకుమారి
 అత్తిలి లక్ష్మి
 ఝాన్సీ
 రంగనాథ్
 సాక్షి రంగారావు

సాంకేతిక వర్గం 

 స్టిల్స్: డి.రాధాకృష్ణమూర్తి
 ఆపరేటివ్ ఛాయాగ్రహణం: జి.ఆర్.మోహన్
 నృత్యాలు: రాజన్ రాజు
 పోరాటాలు: శివం రాజు
 మాటలు: జంధ్యాల
 పాటలు: సి.నారాయణరెడ్డి, వేటూరి సుందరరామమూర్తి, దాసం గోపాలకృష్ణ
 నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ, రమేష్
 కూర్పు: కె.బాబూరావు
 కళ: కళాధర్
 సంగీతం: చక్రవర్తి
 ఛాయాగ్రహణం: జి.కె.రాము
 నిర్మాత: డి.వి.ఎస్.రాజు
 కథ, చిత్రకథానుసరణ, దర్శకత్వం: కె.విశ్వనాథ్

మూలాలు

బాహ్య లంకెలు 
 

కృష్ణంరాజు నటించిన సినిమాలు
మిక్కిలినేని నటించిన సినిమాలు
నాగభూషణం నటించిన సినిమాలు
అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు
నూతన్ ప్రసాద్ నటించిన చిత్రాలు
జయసుధ నటించిన సినిమాలు
పుష్పకుమారి నటించిన సినిమాలు
పి.ఎల్.నారాయణ నటించిన సినిమాలు
రమాప్రభ నటించిన చిత్రాలు
కవిత నటించిన సినిమాలు
అల్లుడుగారు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఎం.మోహన్ బాబు నిర్మించిన తెలుగు చిత్రం. ఇది ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ చిత్రమ్‌కు రీమేక్.

కథ 
కల్యాణి రామచంద్ర ప్రసాద్ ఒక్కగానొక్క కూతురు. ఆయన అమెరికాలో ఉంటూ తన కూతురును భారతదేశంలో ఉండి చదివిస్తుంటాడు. కల్యాణి ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. రామచంద్రప్రసాద్ ఈ వివాహాన్ని అంగీకరించాడు. ఈ లోపు కల్యాణి ప్రేమించిన వ్యక్తి ఆమెను మోసం చేసి పారిపోతాడు. రామచంద్రప్రసాద్ మనసు మార్చుకుని ఆమె వివాహానికి అంగీకరిస్తాడు. భారతదేశానికి వచ్చి ఒక రెండు వారాలపాటు కూతురు, అల్లుడుతో కలిసి ఉండాలని కోరుకుంటాడు. తండ్రి అనారోగ్యంతో ఉండటంతో ఆయన సంతోషం కోసం కల్యాణి, ఆమె లాయరు ఆనంద్ కలిసి విష్ణు అనే అతన్ని రామచంద్ర ప్రసాద్ భారత్ లో ఉన్నన్నాళ్ళు నకిలీ భర్తగా ఏర్పాటు చేస్తారు.

నటీనటులు
 విష్ణుగా మోహన్ బాబు
 కల్యాణిగా శోభన, రామచంద్ర ప్రసాద్ కూతురు
 రామచంద్ర ప్రసాద్‌గా కొంగర జగ్గయ్య
 ఆనంద్‌గా చంద్రమోహన్, లాయరు
 గొల్లపూడి మారుతీరావు
 కైకాల సత్యనారాయణ, జైలరు
 నిళల్‌గల్ రవి
 సుధాకర్
 సారథి
 నాగేంద్ర
 సరస్వతి
 బబిత
 రమ్యకృష్ణ (అతిథి నటి)

సాంకేతికవర్గం
 దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
 కథ: ప్రియదర్శన్
 మాటలు: సత్యానంద్
 పాటలు: జాలాది, జొన్నవిత్తుల, గురుచరణ్, రసరాజు
 సంగీతం: కె.వి.మహదేవన్

పాటలు
 ముద్దబంతి నవ్వులో మూగకళ్ళ ఊసులు - జేసుదాస్, చిత్ర , రచన: గురుచరణ్.
 కొండమీద - బాలు, చిత్ర
 నగుమోము గనలేని (త్యాగరాజు కీర్తన) - జేసుదాస్, పూర్ణచందర్
 కొండలలో నెలకొన్న (అన్నమయ్య కీర్తన)- జేసుదాస్, చిత్ర
 అమ్మో అమ్మో - బాలు, చిత్ర

అవార్డులు
 ఈ చిత్రంలో పాడిన కె. జె. యేసుదాసుకు ఉత్తమ నేపథ్య గాయకునిగా నంది పురస్కారం లభించింది.

మూలాలు

బయటిలింకులు
 
  1938-1990 Telugu Movies Database

జగ్గయ్య నటించిన సినిమాలు
శోభన నటించిన చిత్రాలు
కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రాలు
మోహన్ బాబు నటించిన చిత్రాలు
రమ్యకృష్ణ నటించిన చిత్రాలు
కె.వి.మహదేవన్ సంగీతం కూర్చిన సినిమాలు
మలయాళ సినిమా పునర్నిర్మాణాలు
చంద్రమోహన్ నటించిన సినిమాలు
అల్లుడుగారు వచ్చారు 1999లో విడుదలైన తెలుగు చలనచిత్రం. దీనిని ఎం.ఆర్.సి & మెలోడీ థియేటర్స్ పతాకంపై సుంకర మధు మురళి, ముళ్ళపూడి బ్రహ్మానందం నిర్మించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. జగపతి బాబు, కౌసల్య, హీరా రాజగోపాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. ఇది తమిళ చిత్రం పూవేలి (1998) కి రీమేక్, ఎ వాక్ ఇన్ ది క్లౌడ్స్ (1995) సినిమాకు అనధికారిక రీమేక్.  

మురళి (జగపతి బాబు) కుటుంబ సంబంధాలను కోరుకునే అనాథ. అతను ప్రొఫెషనల్ వయోలిన్ వాయిద్యగాడు, నేపథ్య గాయకుడు. షాలిని (హీరా రాజగోపాల్) తో ప్రేమలో పడతాడు. ఆమెపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ వెంటపడతాడు. కానీ ఆమె అతని ప్రేమను అవమానించినప్పుడు, ఇక ఆమెను ఇబ్బంది పెట్టననీ, ఏదో ఒక రోజున ఆమే తనను అర్థం చేసుకుని తన వద్దకు వస్తుందనీ చెబుతాడు. ఒక రోజు, మురళి తన చిన్ననాటి స్నేహితురాలు మహా / మహాలక్ష్మి (కౌసల్య) ను కలుస్తాడు. అంతకు కొద్ది కాలం క్రితమే ఆమె ప్రేమికుడు మధు (అబ్బాస్) ను ప్రమాదంలో మరణించాడు. తండ్రి తమ ప్రేమను అంగీకరించేందుకు వత్తిడి చెయడం కోసం, తామిద్దరూ అప్పటికే పెళ్ళి చేసుకున్నామని అబద్ధం చెప్పి ఉంది. ఇదిలా ఉండగా, మురళే ఆమె భర్త అని ఆమె మేనమామ అనుకుంటాడు. ఆ పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఆమె గ్రామానికి వెళ్తారు. కానీ మహా తండ్రి రాఘవరావు (నాసర్) వారిద్దరి పెళ్ళి పట్ల చాలా కోపంగా ఉంటాడు. మురళిని తన అల్లుడిగా అంగీకరించడు. 

వాస్తవానికి, ఆ ఇంటి సభ్యులకు తాను నచ్చకుండా చేసుకోవాలని మురళి ప్రయత్నం. ఆ విధంగా అతను మహాను, ఆ ఊరినీ వదలి తేలిగ్గా వెళ్ళిపోవచ్చు. అందుకోసం అతడు వేసే ప్రణాళికలు ఎదురొచ్చి, అతనికి వారి ప్రేమ ఆప్యాయతలు సంపాదించి పెడతాయి. ఆ విధంగా అతడు ఆ ఇంట్లో ఉంటూండగా ఆ కుటుంబంలో సభ్యుడుగా ఉండడం క్రమేణా ఇష్టపడటం మొదలౌతుంది. మహాతో ప్రేమలో కూడా పడతాడు. అయితే మురళి, మహా మధ్య ఉన్న భార్యాభర్తల కథను మహా అమ్మమ్మ (రమా ప్రభ) పసిగడుతుంది. ఆమెకు మహాపై ఉన్న ప్రేమ వలన, వారిద్దరికీ పెళ్ళి చెయ్యడానికి ఆమె ఒక నాటకం ఆడుతుంది. 

ఇదిలా ఉంటే, షాలిని మురళి పట్ల ప్రేమ పెంచుకుంటుంది. మురళి మహాల పెళ్ళికి ముందు ఆమె ఆ గ్రామానికి వస్తుంది. అందరి మనస్సులలో సందేహాలను సృష్టిస్తుంది. ఇది కొంత గందరగోళానికి, సమస్యలకూ దారితీస్తుంది. చివరగా, మురళి మహాల పెళ్ళితో సినిమా ముగుస్తుంది.

తారాగణం 

 జగపతి బాబు (మురళి)
 నాజర్ (రాఘవరావు)
 హీరా (షాలిని)
 కౌసల్య (మహా)
 రమాప్రభ (మహా అమ్మమ్మ)
 సుదీప

సంగీతం 
ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చాడు. పాటలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశాడు. దీన్ని హెచ్‌ఎంవి ఆడియో కంపెనీ విడుదల చేసింది.

మూలాలు 

తెలుగు సినిమాలు
1999 తెలుగు సినిమాలు
జగపతి బాబు నటించిన చిత్రాలు
రమాప్రభ నటించిన చిత్రాలు
రీమేక్ సినిమాలు
కీరవాణి సంగీతం కూర్చిన సినిమాలు
ఏకాదశ రుద్రులు:

శివుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిచ్చును. ఓంనమస్తేస్తు భగవన్ "విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః" అని రుద్రనమకంలో చెప్పబడినది. దీనిప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు 1. విశ్వేశ్వరుడు, 2.మహాదేవుడు,3. త్ర్యంబకుడు, 4.త్రిపురాంతకుడు, 5.త్రికాగ్నికాలుడు, 6.కాలాగ్నిరుద్రుడు, 7.నీలకంఠుడు, 8.మృత్యుంజయుడు, 9.సర్వేశ్వరుడు,10. సదాశివుడు మరియు 11. శ్రీమన్మహాదేవుడు. ఏకాదశ రుద్రులు మరియు వారిభార్యలైన ఏకాదశ రుద్రాణుల పేర్లు క్రింద ఈయబడినవి. 

1.అజపాదుడు- ధీదేవి

2.అహిర్భుద్న్యుడు- వృత్తిదేవి

3.త్ర్యంబకుడు- ఆశనదేవి

4.వృషాకపి- ఉమాదేవి

5.శంభుడు- నియుత్ దేవి

6.కపాలి- సర్పిదేవి

7.దైవతుడు- ఇల దేవి

8.హరుడు- అంబికాదేవి

9.బహురూపుడు- ఇలావతీదేవి

10.ఉగ్రుడు- సుధాదేవి

11.విశ్వరూపుడు- దీక్షాదేవి 

అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభలతీర్థంలో ఏకాదశ రుద్రులతోకూడిన ప్రభలు సంక్రాంతి పండుగలలో కనుమరోజు భక్తజనులకు దర్శనమిచ్చి తరింపజేయుచున్నారు. వాటి వివరాలు మనంతెలుసుకుందాము.

1. విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి):

పూర్వకాలంలో ఒకబ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆపులి శివలింగరూపాన్ని పొందిందని కధనము కలదు. వ్యాఘ్రము శివునిగా అవతరించుటచే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడెను.

2. మహాదేవరుద్రుడు- కె. పెదపూడి (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి):

పూర్వకాలంలో విశ్వామిత్రుని తపోభంగముకొరకు ఇంద్రుడు మేనకను పంపెను. విశ్వామిత్రునకు, మేనకకు శకుంతల జన్మించెను. తరువాత మేనక స్వర్గమునకు పోవుదమని ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయినది. అపుడు ఆమె శివుని ప్రార్ధించగా ఆయన ఒకశివలింగమును మేనకకు ఇచ్చి ఆప్రదేశములో ప్రతిష్ఠింపుమనెను. అపుడు మేనక కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి) నందు శివలింగమును ప్రతిష్ఠించి స్వర్గమునకు పోయెనని కధనముకలదు. మేనకచే ప్రతిష్ఠింప బడుటచే మేనకేశ్వరస్వామి అని పిలువబడెను. 

3. త్ర్యంబకేశ్వరుడు- ఇరుసుమండ (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి):

రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి పుష్పకవిమానం కదలకుండా నిలిచిపోయినది. అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించెనని కధనము కలదు. అపుడు వారి పుష్పకవిమానము ముందుకు కదలగా వారందరూ ఆనందభరితులైరి. రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనందరామేశ్వరుడని పిలువబడెను. 

4. త్రిపురాంతక రుద్రుడు- వక్కలంక (శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి):

తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామము నందు శివలింగరూపంలో ఆవిర్భవించెనని కధనము కలదు. అపుడు ఆగ్రామపు బ్రాహ్మణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడెను. 

5. త్రికాగ్నికాల రుద్రుడు- నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి):

మూడు అగ్నులయందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి శివుడు లింగరూపమును పొందుటచే త్రికాగ్ని కాలునిగా పిలువబడి అగస్త్యమహర్షిచే నేదునూరు గ్రామమున ఈశివలింగము ప్రతిష్ఠింపబడినది. శ్రీ ఉమాచెన్నమల్లేశ్వర స్వామిగా సర్వజనులచే కొలువబడుచున్నాడు.

6. కాలాగ్ని రుద్రుడు- ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి):

రావణ సంహారం తరువాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రములను, ఖడ్గమును ప్రసాదించెను.  రాఘవునిచే ప్రతిష్ఠింపబడుట వల్ల రాఘవేశ్వరస్వామిగా పిలువబడెను.

పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుని పరీక్షింపదలచి కిరాతునివేషంలో అర్జునుని ధైర్యపరాక్రమములను చూచి పాశుపతాస్త్రమును ప్రసాదించెనని, ఆయనే ఈ కాలాగ్నిరుద్రుడని మరియొక కధనముకలదు. 

7. నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి ( శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి ):

దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మధన సమయంలో వెలువడిన విషవాయువులను ఎవ్వరికీ హానికలిగించకుండా చేయుటకు శివుడు తనకంఠమునందు నిక్షిప్తముచేసికొని నీలకంఠుడైనాడు. ఆగరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. తనను కొలిచినవారికి అనంతభోగాలను అందించేవాడు, మరియు అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించినవాడు అగుటవల్ల అనంత భోగేశ్వరస్వామిగా పిలువబడెను.

8. మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):

శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖమునుండి రక్షించి, యముని జయించి "మృత్యుంజయుడు" అయ్యెను. ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మిగ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలువబడెను. 

9. సర్వేశ్వర రుద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీవీరేశ్వర స్వామి): 

దక్షుని యజ్ఞంలో సతీదేవి తనతండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తనకాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్పడిన అగ్నిజ్వాలలందు కాలిబూడిద అయినపుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యముచేసి తనజటాజూటములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించెను. వీరభద్రుడు అపుడు దక్షయజ్ఞమును ధ్వంసముచేసెను. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారమునందు వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను. 

10. సదాశివ రుద్రుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):

పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరుగొప్పవారని వాదనకుదిగి శివుని వద్దకు వచ్చిరి. అపుడు శివుడు ఆద్యంతములులేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణువును తన పాదములను చూచిరమ్మని పంపెను. విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను. కాని బ్రహ్మమాత్రము శివుని శిరస్సును చూడకపోయినను ఒకఆవును, మొగలిపువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితినని చెప్పెను. శివునికి ఆగ్రహము వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించివిష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. ఆలింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను. 

11. శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు):

పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్రకమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆమహాదేవుడు పుల్లేటికుర్రు గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటికుర్రు గ్రామానికి "పుండరీకపురము" అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. పుండరీకము అనగా వ్యాఘ్రము(పులి) అని అర్ధము కలదు. వ్యాఘ్రేశ్వరమునందు వ్యాఘ్రేశ్వరస్వామి ఉండుటచేత ఈ గ్రామమునందు శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అనుపేరుతో పిలువబడెను.

ప్రభ అనగా కీర్తి అని అర్ధం. పూర్వకాలంలో మా ఊరు కీర్తి ఇంత ఉంది అని చెప్పేందుకు ప్రభలను బాగా పొడవుగా కట్టేవారు. ప్రభ ఎంత పొడవుగా ఉంటే ఆ ఊరు కీర్తి అంత ఎక్కువ అని అర్ధం.

(ముఖ్య గమనిక: ఏకాదశ రుద్రుల గురించి ఈ వివరాలను నేను 2015 సంవత్సరంలో కార్తీక మాసంలో అన్నిదేవాలయాలను స్వయంగా సందర్శించుకొని పరిశోధనచేసి నా ఫేస్ బుక్ అకౌంట్ నందు అందించడం జరిగింది. దీనిని చాలామంది తరువాత వారి సైట్లలో వారే వ్రాసినట్లుగా కాపీ చేయడం జరిగింది. అటువంటివారు నా పేరును సూచించవలసినదిగా తెలియజేయుచున్నాను.)  

శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కార్తీకమాస పుణ్యదినములలో ఏకాదశ రుద్రులకు మాకుటుంబ సభ్యులందరి తరపున శతసహస్ర వందనములు. సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు........ సర్వేజనాః సుఖినోభవంతు.......... సమస్త సన్మంగళాని సంతు........ స్వస్తి.... Written by Nemani.V.V.S.N.Murty, Lecturer in Physics, Nedunuru, Inavilli Mandal, Konaseema District, Andhra Pradesh, Mobile: 9440249930.
నవధాన్యాలు అనగా తొమ్మిది రకాల ధాన్యాలు. అవి
1గోధుమలు
2యవలు
3పెసలు
4శనగలు
5కందులు
6అలసందలు
7నువ్వులు
8మినుములు
9ఉలవలు 

నవధాన్యాలను నవగ్రహాలకు సంకేతంగా భావిస్తుంటారు. సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యము, కుజ గ్రహానికి కందులు, బుధ గ్రహానికి పెసలు, గురు గ్రహానికి సెనగలు, శుక్ర గ్రహానికి బొబ్బర్లు, శని గ్రహానికి నువ్వులు, రాహుగ్రహానికి మినుములు, కేతు గ్రహానికి ఉలవలు అధీన ధాన్యాలుగా పరిగణిస్తారని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. నవధాన్యాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి వుండి ఎంతో బలమైన పోషకాలను అందిస్తాయి.

నవధాన్యాలను దైవకార్యాల్లోను, శుభకార్యాలలోను ఉపయోగిస్తారు. వివాహ సమయంలో ఈ నవధాన్యాలను మట్టి మూకుళ్లలోపోసి ఉంచడమనే ఆచారం ఉంది. అవి మొలకెత్తి బాగా పెరిగితే ఆ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని భావిస్తారు.

నవధాన్యాలలో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైన గుణాన్ని కలిగి ఉన్నాయి. వాటిని సమపాళ్లలో స్వీకరించినప్పుడే దేహానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. జీవితంలో కూడా అన్ని రకాల మనస్తత్వాలు గల వాళ్లని కలుపుకు పోయినప్పుడే, పరిపూర్ణత ఏర్పడుతుందనే విషయాన్ని కూడా ఇది స్పష్టం చేస్తుంది.

మూలాలు

బాహ్య లంకెలు
 శుభకార్యాలలో నవధాన్యాలు తప్పనిసరా..? || Dharma Sandehalu || Bhakthi TV
నవగ్రహాలు (Nine Planets, Navagrahas) అనగా తొమ్మిది గ్రహాలు. ఈ పదాన్ని రెండు విషయాలలో వాడుతారు.
 ఖగోళ శాస్త్రములో సూర్యుని చుట్టూ తిరిగే తొమ్మిది గోళాలు. అయితే ఇటీవలి కాలంలో చివరి గ్రహమైన ప్లూటో గ్రహం కాదని శాస్త్రజ్ఞులు తీర్మానించారు. కనుక ఇప్పుడు ఎనిమిది గ్రహాలు అనే చెప్పడం ఉచితం.
 భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో జీవితాలపైనా, ఘటనలపైనా ప్రభావం చూపే గ్రహాలు. ఖగోళ శాస్త్రంలో ఉన్న గ్రహాలకూ, ఈ నవ గ్రహాలకూ కొంత భేదం ఉంది. సూర్యుడు (సౌరమండలం కేంద్ర నక్షత్రం), చంద్రుడు (భూమికి ఉప గ్రహం).కానీ.,మన ఈ జ్యోతీశ్య శాస్త్రంలో & సంప్రదాయంలో సూర్య, చంద్రులు కూడా  గ్రహాలుగా పరిగణింప బడుతాయి !యురేనస్, నెప్ట్యూన్ లు మన ఈ శాస్త్రం లెక్కలోకి రావు. కాని, రాహువు, కేతువు అనే రెండు ఛాయా గ్రహాలను ఈ సంప్రదాయంలో గ్రహాలుగా గణిస్తారు.

ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం (2006 కు ముందు) 

 బుధుడు
 శుక్రుడు
 భూమి
 కుజుడు (అంగారకుడు)
 బృహస్పతి (గురుడు)
 శని
 యురేనస్ (వరుణుడు)
 నెప్ట్యూన్ (ఇంద్రుడు)
 ప్లూటో (యముడు) (ప్రస్తుతం గ్రహ హోదా కోల్పొయింది - 2006 ఆగస్టులో ఖగోళ విజ్ఙాన శాస్త్రవేత్తలు 'ప్లూటో'ని గ్రహం కాదని, కేవలం సౌరకుటుంబంలో ఒక వస్తువని తీర్మానించారు)

ఈ గ్రహాల పరిమాణం, దూరం వంటి ముఖ్య వివరాలు క్రింది పట్టికలో ఇవ్వడ్డాయి.

భారత జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం 

జ్యోతిష్య సంప్రదాయంలోనూ, తత్ఫలితంగా హిందువుల దైనందిక జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుష్యుల స్థితి గతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలా మంది దృఢంగా విశ్వాసం కలిగి ఉంటారు. సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి శచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ. సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు. సూర్యుడు ఆయనముకు, చంద్రుడు క్షణముకు, కుజుడు ఋతువుకు, బుధుడు మాసముకు, గురువు పక్షముకు, శుక్రుడు సంవత్సరంలకు అధిపతులు. 

 సూర్యుడు
 చంద్రుడు
 అంగారకుడు (మంగళగ్రహం)
 బుధుడు
 గురువు
 శుక్రుడు
 శని
 రాహువు
 కేతువు

నవ గ్రహాల పూజ 
నవ గ్రహాలను పూజించడం, హోమాలు, వ్రతాలు నిర్వహించడం చాలామంది హిందువుల ఆచారాలలో ఒక ముఖ్యమైన అంశం. చాలా ఆలయాలలో, ముఖ్యంగా శివాలయాలలో నవగ్రహాల మందిరాలు ఉంటాయి. ఇంకా ప్రత్యేకించి గ్రహాల ఆలయాలు కూడా ఉన్నాయి.

నవగ్రహాల విశేషాలు 
జ్యోతిష్య సంప్రదాయంలో నవ గ్రహాల గుణాలనూ, సంకేతాలనూ తెలిపే ఒక పట్టిక క్రింద ఇవ్వబడింది.

నవగ్రహాల ఆలయాలు 
నవగ్రహ అలయలు మొత్తంగా తమిళనాడులో ఉన్నాయి. అవి 
 
 అంగారక గ్రహనికి గాను వైదీస్వరన్ కొయిల్ 
 బుధ గ్రహానికి గాను తిరువంగాడ్ 
 శుక్ర గ్రహానికి గాను కంజనూర్ 
 కేతు గ్రహానికి గాను కీల్రుమ్పల్లమ
 గురు గ్రహానికి గాను ఆలంగుడి
 శని గ్రహానికి గాను తిరునల్లారు
 రాహువు గ్రహానికి గాను తిరునాగేశ్వరమ్ 
 చంద్ర గ్రహానికి గాను తిన్గలూరు
 సూర్య గ్రహానికి గాను సూరియానార్ కొయిల్

నవగ్రహ ధ్యాన శ్లోకములు 

నవగ్రహాలను స్తుతించే ఒక బహుళ ప్రచారంలో ఉన్న శ్లోకం
 ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
 గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

రవి 
జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో‌రిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం

చంద్ర 
దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం

కుజ 
ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం

బుధ
ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం

గురు
దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభం
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం

శుక్ర
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం

శని
నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం

రాహు
అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్

కేతు
ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్

నవగ్రహాలు
షోడశదానాలు: 
 గోదానము
 భూదానము
 సువర్ణదానము  (బంగారం)
 రజతదానము (వెండి)
 రత్నదానము
 సరస్వతి (పుస్తకము)
 తిలదానము (నువ్వులు)
 కన్యాదానము
 గజదానము (ఏనుగు)
 అశ్వదానము (గుర్రము)
 శయ్యాదానము (మంచము)
 వస్త్రదానము
 భూమిదానము
 ధాన్యదానము
 దధిదానము (పెరుగు)
 చత్రదానము (గొడుగు)
 గృహదానము (ఇల్లు)
పాదుకా పట్టాభిషేకం (1932 సినిమా)
 పాదుకా పట్టాభిషేకం (1945 సినిమా) 
 పాదుకా పట్టాభిషేకం (1966 సినిమా)
రామదాసు 1933లో విడుదలైన తెలుగు టాకీ సినిమా. ఇది కలకత్తాలోని ఈస్టు ఇండియా ఫిలిం కంపెనీ వారిచే తయారుచేయబడింది. శ్రీమాన్ బళ్ళారి, ధర్మవరం గోపాలాచార్యులు రచించిన రామదాసు నాటకము నుండి చలనచిత్రమునకు తగినట్లుగా మార్చబడింది. దీనికి అక్తర్ నవాజ్ డైరెక్టరు, కృష్ణగోపాల్ ఫోటోగ్రాఫర్, ఆర్. సి. విల్‌మన్, సి. యన్. నిగం శబ్దగ్రాహకులు.

1933లో ఈస్ట్‌ ఇండియా ఫిలిం కంపెనీ వారు అఖ్తర్‌ నవాజ్‌ దర్శకత్వంలో ‘రామదాసు’ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. అప్పట్లో బళ్ళారి రాఘవ, ధర్మవరం గోపాలాచార్యులు ‘రామదాసు’ నాటకాన్ని ప్రదర్శిస్తూ వుండేవారు. అదే నాటక స్క్రిప్టుని సినిమాగా తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు అందులో కబీరుగా నటించేందుకు బలరామయ్య అన్న రాధాకృష్ణయ్యకు, రాముడుగా నటించేందుకు మరో అన్న శేషాచలంకు ఆహ్వానాలు అందాయి.

నటీనటులు

కీర్తనలు

మూలాలు

ఇతర లింకులు
 ఐ.ఎం.బి.డి లో చిత్ర వివరాలు
 హిందూ పత్రికలో చిత్ర విశేషాలు
1933 తెలుగు సినిమాలు
తెలుగు జీవితచరిత్ర సంబంధమైన చిత్రాలు
సి.ఎస్.ఆర్. నటించిన సినిమాలు
రామదాసు 1933లో విడుదలైన తెలుగు చిత్రం. చిత్తజల్లు పుల్లయ్య, ఘంటసాల రాధాకృష్ణయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిలకలపూడి సీతారామాంజనేయులు, నెల్లూరి నాగరాజారావు, రామతిలకం, ఘంటసాల బలరామయ్య, ఆరణి సత్యనారాయణ లు నటించారు.

నటవర్గం 
 చిలకలపూడి సీతారామాంజనేయులు
 నెల్లూరి నాగరాజారావు
 రామతిలకం
 ఘంటసాల బలరామయ్య
 ఆరణి సత్యనారాయణ

సాంకేతికవర్గం 
 దర్శకత్వం: చిత్తజల్లు పుల్లయ్య, ఘంటసాల రాధాకృష్ణయ్య
 నిర్మాణ సంస్థ: కృష్ణా ఫిలిమ్స్

మూలాలు 

1933 తెలుగు సినిమాలు
తెలుగు భక్తి చిత్రాలు
అహల్య 1934 డిసెంబరు 31న విడుదలైన సినిమా. పయనీర్ పిలింస్ పతాకంపై ఈ సినిమాను కొచ్చెర్ల రంగారావు నిర్మించి దర్శకత్వం వహించాడు.  రామాయణం నుంచి స్వీకరించిన కథను ఆధారం చేసునుకుని రాశారు. అయితే సినిమా ఆర్థికంగా విఫలమైంది.

తారాగణం 

 పారుపల్లి సుబ్బారావు
 శ్రీరంజని సీనియర్
 మాస్టర్ భీమారావు
 మల్లేశ్వరరావు

సాంకేతిక వర్గం 

 దర్శకత్వం, నిర్మాత: కె.రంగారావు

మూలాలు 

1934 తెలుగు సినిమాలు
రామాయణం ఆధారంగా నిర్మించబడిన సినిమాలు
తెలుగు పౌరాణిక చిత్రాలు
తెలుగు భక్తి చిత్రాలు
ఆలుమగలు 1959లో విడుదలైన తెలుగు సినిమా. ఎం.ఎ.వి.పిక్చర్స్ పతాకంపై ఎం.ఎ.వేణు నిర్మించిన ఈ సినిమాకు కృష్ణారావు దర్శకత్వం వహించాడు. జగ్గయ్య, జానకి, రమణారెడ్డి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.

తారాగణం 

 జగ్గయ్య
 షావుకారు జానకి
 రమణారెడ్డి
 గిరిజ
 ఛాయాదేవి

సాంకేతిక వర్గం 

 నిర్మాత: ఎం.ఎ. వేణు
 దర్శకుడు: కృష్ణారావు
 సంగీతం: కె.వి.మహదేవన్
 పాటలు: ఆత్రేయ
 నేపథ్యగానం: ఘంటసాల, జానకి, ఎ.పి.కోమల, పి.సుశీల

పాటలు

 ఆడుకో నా తండ్రి ఆడుకొ నాగరాజు నీడలో నవ్వుతూ ఆడుకో - పి.సుశీల
 ఎందుకూ కవ్వించేదెందుకు ఈ హృదయం కదిలించి - ఘంటసాల, ఎస్. జానకి
 ఒరె ఒరె ఒరె ఒరే ఓరే వినరా వినరా ఒరే ఒరే విననంటావా సరేసరే - మాధవపెద్ది
 ఒకటి ఒకటి ఒకటి మానవులందరు ఒకటి రెండు రెండు - పి.సుశీల
 చీకటిరా బాబు చీకటిరా ఈ చీకటిలో వింతలోకమురా - ఘంటసాల
 రాలిపోయిన ఓ రోజా నీరాయిది ఎరుగడు నీరాజా - ఎస్. జానకి, ఎ.పి. కోమల
 సంసారం మహా సాగరం ఈదాలి ఏకమై ఇద్దరం - పి.సుశీల, ఘంటసాల
 జననీ వినుమా రామచంద్రుడు జననాధుడు కాడు
 మల్లెపూల వెన్నెలలోన మాటేసే మామయ్యా మరదల్ని చూసినతోటే
 యుగయుగాలుగా తరతరాలుగా మగువల మాయకు మాయ మాటలకు
 వందేమాతరం వందేమాతరం మనదీ భారతదేశం

వనరులు

 ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

జగ్గయ్య నటించిన సినిమాలు
ఆలుమగలు 1995లో విడుదలైన తెలుగు సినిమా. సాయి అన్నపూర్ణ సిని చిత్ర పతాకంపై కె.విజయలక్ష్మి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు సాగర్ దర్శకత్వం వహించడు. సుమన్, మీనా, ఆమని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.

తారాగణం 

 సుమన్
 మీనా
 ఆమని
 సత్యనారాయణ
 కోట శ్రీనివాసరావు

సాంకేతిక వర్గం 

 బ్యానర్: సాయి అన్నపూర్ణ సినీ చిత్ర
 పోరాటాలు: రాంబో రాజ్ కుమార్
 కళ: చంటి
 కూర్పు: గౌతంరాజు
 సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ
 ఛాయాగ్రహణం: ఎస్.గోపాలరెడ్డి
 నిర్మాత: కె.విజయలక్ష్మి ప్రసాద్
 చిత్రానువాదం, దర్శకత్వం: సాగర్

పాటలు 

 చిగురుటాకు...: గాయకులు: శ్రీలేఖ పార్థసారథి, గీత రచయిత  : భువనచంద్ర
 దిద్దినాక ధీంత...: గాయకులు: రాధిక, శ్రీలేఖ పార్థసారథి . గీత రచయిత  : సిరివెన్నెల సీతారామశాస్త్రి
 హవా హవా: గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, గీత రచయిత  : భువనచంద్ర
 క్షణమొక యుగంగా...: గాయకులు: ఎం.ఎం.కీరవాణి, గీత రచయిత  :శివ శక్తి దత్తా
 మళ్ళి మళ్ళీ.. గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, గీత రచయిత  : సిరివెన్నెల సీతారామశాస్త్రి
 మూరెడంత మీసం.: గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రీలేఖ పార్థసారథి, గీత రచయిత  : భువనచంద్ర
 నచ్చిండోయమ్మో...గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రీలేఖ పార్థసారథి. గీత రచయిత  : శివ శక్తి దత్తా
 ఊడుకు దుడుక్కు.. గాయకులు: నాగూర్ బాబు, ఎస్.పి.శైలజ, గీత రచయిత  : సిరివెన్నెల సీతారామశాస్త్రి
 శ్రీరామ నీ పాదం... గాయకులు: ఎం.ఎం.కీరవాణి, శ్రీలేఖ పార్థసారథి, గీత రచయిత  : సిరివెన్నెల సీతారామశాస్త్రి
 తన ఇంటి పెరిగింది..:గాయకులు: N/A గీత రచయిత  : సిరివెన్నెల సీతారామశాస్త్రి

మూలాలు

బాహ్య లంకెలు 
 
 

కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
సత్యనారాయణ నటించిన చిత్రాలు
అమరజీవి 1956లో వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా. అమరదీపం అనే తమిళ సినిమా దీనికి మూలం.

పాటలు
 కుములబోకు నేస్తం తీరునోయి భారం నిన్న రాదు సాయం
 కొల్లాయి కట్టి కావి కట్టి ఊరు విడిచేసి పోతనే పోవనీ
 తేనియలందు మరు మల్లియలందు కోటి తేటి పలుమార్లు
 నన్నే మరచితివో ఏమో ఎటునే మనగలనో నా ప్రభూ
 నాణ్యం మనుషులకు అవసరం అబ్బి బాబు అవసరం
 నారియో జింఖానా కోరుకో గుమ్ఖానా ఆడుకో సుల్తానా
 పక్షినై వాలుదు వాలి వచ్చి ఆడుదు ఆడి పాడి నీకోసం
 వేషాలు వేస్తాం మేము తిల్లెలేలో దేశ దేశాలు తిరుగుతాం

మూలాలు
 ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

తెలుగు డబ్బింగ్ సినిమాలు
సావిత్రి నటించిన సినిమాలు
నాగయ్య నటించిన సినిమాలు
టి.చలపతిరావు సంగీతం అందించిన సినిమాలు
అమరజీవి జంధ్యాల రచన, దర్శకత్వంలో వహించగా అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద ముఖ్య పాత్రల్లో నటించిన 1983 నాటి తెలుగు చలన చిత్రం. ఈ చిత్రాన్ని భీమవరపు బుచ్చిరెడ్డి, జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించాడు. భీశెట్టి కథను అందించగా, జంధ్యాల స్క్రీన్ ప్లే సమకూర్చాడు. కె. చక్రవర్తి సంగీతం సమకూర్చగా వేటూరి సుందరరామ్ముర్తి పాటలు రాశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి, అనితా రెడ్డి పాటలు పాడారు.

కథ
డాక్టర్ మురళి, లలితల ప్రేమకథతో చిత్రం మొదలవుతుంది. తీరా పెళ్ళి సమయానికి లలిత పెళ్ళికి నిరాకరిస్తుంది. తన అక్క సావిత్రిని మురళి ప్రేమ పేరుతో మోసం చేసినందువలనే తాను ఆత్మహత్యకి పాల్పడినదని, తన మరణానికి కారణం మురళి అని తెలుసుకొన్న లలిత, ప్రేమలో మోసగింపబడితే ఎలా ఉంటుందో తనకి తెలియజేయటానికే అతనితో ప్రేమ నాటకమాడినదని తెలియజెబుతుంది.

చిత్రబృందం

తారాగణం 
ప్రధాన తారాగణం
 డాక్టర్ మురళీధర్ గా అక్కినేని నాగేశ్వరరావు. మురళీధర్ వైద్యునిగా పనిచేస్తుంటారు. పెద్దవయసు వచ్చినా స్త్రీద్వేషంతో పెళ్ళిచేసుకోకుండా ఉండిపోయిన వ్యక్తి. అక్కాచెల్లెళ్ళ చేతిలో వేర్వేరు కారణాలతో రెండు సార్లు పీటల మీది పెళ్ళి ఆగిపోయానా, వారి క్షేమమే కోరుకునే త్యాగమూర్తి. చివరకు తన కళ్ళు కూడా దానం చేసి మరణించి అమరజీవిగా నిలుస్తాడు.
 లలితగా జయప్రద. మురళీధర్ కారణంగా తన అక్క చనిపోయిందని భావించి, అతనికి దగ్గరై అతన్ని కూడా సరిగ్గా పెళ్ళిపీటలపై మోసం చేసే వ్యక్తి. మురళీ తప్పేమీ లేదని తెలసుకున్నప్పుడు పశ్చాత్తాపం పొందుతుంది. ఈమె కోసమే మురళీ తన జీవితాన్నే త్యాగం చేస్తాడు.
 గాయత్రిగా సుమలత. మురళీధర్ ని ప్రేమించి, పెళ్ళిచేసుకోబోయిన సమయంలో దుస్సంఘటనల వల్ల ఆత్మహత్య చేసుకుంటుంది. ఈమె చెల్లెలు లలిత అక్కమరణానికి కక్ష తీర్చుకుంటుంది.
 మధుగా శరత్ బాబు. లలిత భర్త. అతనికే చివర్లో తన కళ్ళు దానం చేసి మురళీ మరణిస్తాడు.
ఇతర తారాగణం
 శేఖర్ గా నరసింహరాజు
 యశోదగా పండరీబాయి
 మాలతిగా శ్రీలక్ష్మి
 బాబుగా నగేష్

సాంకేతిక నిపుణులు 

 దర్శకత్వం, స్క్రీన్ ప్లే - జంధ్యాల
 నిర్మాత - భీమవరపు బుచ్చిరెడ్డి
 కథా రచయిత - భీశెట్టి
 గీత రచన - వేటూరి
 నేపథ్య గాయకులు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, అనితా రెడ్డి
 డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీ - పి.కృష్ణంరాజు
 పాటల రికార్డింగ్ - ఎ.ఆర్.స్వామినాథన్
 అసోసియేట్ డైరెక్టర్లు - బి.ఎస్.నిష్టల, బత్తుల రామకృష్ణ
 డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - ఎస్. గోపాలరెడ్డి
 నృత్యదర్శకుడు - శేషు, శివసుబ్రహ్మణ్యం
 కళాదర్శకుడు - భాస్కరరాజు
 ఎడిటర్ - గౌతంరాజు
 నిర్వహణ - బి.అంజిరెడ్డి

పాటలు
ఈ సినిమాకు కె. చక్రవర్తి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాయగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి, అనితా రెడ్డి పాటలు పాడారు.
 మల్లెపూల మారాణికి బంతి పూల పారాణి
 అసుర సంధ్యవేళ ఉసురు తగుల నీకు స్వామీ
 ఎలా గడపనూ ఒక మాసం ముప్పై రోజుల ఆరాటం

మూలాలు 

అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు
జంధ్యాల దర్శకత్వం వహించిన సినిమాలు
1952లో తమిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో డబ్బింగు చేసి 1953లో విడుదల చేశారు. ఈ సినిమాకు గాను త్యాగరాజ భాగవతార్ కు రెండు లక్షల పారితోషికం ఇచ్చారు.

పాటలు

 అంతా ప్రేమయే నించునే లోకమందు కల్మి లేమి కళ -
 అమ్మ తండ్రి అన్న ప్రియా నా నన్నే ఆదరించు వదన్యులై -
 ఎల్లా దు:ఖమయం హాయి ఎవరికి ఏది అదియే (పద్యం) -
 ఒక చెడుగున్ చేయగలేదే... ఈశా దుర్మార్గులా పాపాలు -
 ఓ ఓ ఓ వాక్పతిపోలే ఆదరించేది ఆశయార్డమే ఎన్నాళ్ళు -
 ఓ రాజా విడిచినావా .. ఆలుబిడ్డల నెడబాసి పదవులరోసి - ఘంటసాల 
 కలవాణీ దేవీ అమర్ వాక్కు ధన్యమై కావుమా ఇల ఉనికినే -
 చెలి మధుపమే ఒక పూసతి మరందం పానం చేయదే -
 నినుబోలి నీలకడలిగ్రాలున్ ముద్దైన మణికిన్ (పద్యం) -
 పళ్ళండోయి తినే పళ్ళండోయి వెలయే చౌకండోయి -
 పసియార్తే నొందదే ఎందైనా చేరదో.. కష్టించి బ్రతక -
 పాదరసంబోలు పండువెన్నెలహో అకాశ (పద్యం) - ఘంటసాల 
 పూవై హసించిన అంతా మా చేతిలో భూజనుల్ వశమేకారా -
 విడ్యమే పోనాడియే వాతెరపండు బాలభామినీమణుల్ (పద్యం) -
 సేవ చెయ్యాలి కానగాన్ భువిమీదనే ఉన్నవారూ ఇంపౌ అనుభవమే -

వెలుపలి లింకులు
அமரகவி

మూలాలు

తెలుగు డబ్బింగ్ సినిమాలు
అమర ప్రేమ 1978 లో విడుదలైన తెలుగు సినిమా.

తారాగణం 
 కమల్ హాసన్
 జరీనా వహాబ్
 సావిత్రి
 కైకాల సత్యనారాయణ 
 నాగభూషణం 
 ఛాయాదేవి
 రాజబాబు 
 రమాప్రభ

పాటలు 
సలీల్ చౌదరి
 ఈ ప్రియురాలికి పెళ్ళి జరిగెను ప్రేమ పలించేను - పి.సుశీల బృందం
 పాల పావురమా ఒక గూడు కడదామా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 పాల మబ్బుల తేలే గాలిలా రాలేవా వర్షపు జల్లులా - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 బుజ్జి బాబు కావలా బుల్లి పాప కావాలా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

మూలాలు 

 ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

బయటి లింకులు 
 

కమల్ హాసన్ నటించిన చిత్రాలు
సావిత్రి నటించిన సినిమాలు
ఛాయాదేవి నటించిన చిత్రాలు
నాగభూషణం నటించిన సినిమాలు
సత్యనారాయణ నటించిన చిత్రాలు
రమాప్రభ నటించిన చిత్రాలు
దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కిది తొలి చిత్రం. ఈ చిత్రానికి హిందీ చిత్రం 'బైజు బావరా' చిత్రానికి చాలా పోలికలు కనిపిస్తాయి. ఏ.ఎం.రాజా పాడిన 'ఏదో నవీన భావం' పాట జనరంజకమైనది.

పాటలు
 ఆనతి కావలెనా గానానికి సమయము రావలెనా - ఎ. ఎమ్. రాజా
 ఏదో ఏదో నవీనభావం కదిలించే మధుర మధుర - ఎ. ఎమ్. రాజా
 దయామయి దేవి శారద - (గాయని వివరాలు లేవు)
 ప్రియతమా మరులుమా తిరిగిరాని పయనమేల - జిక్కి
 మధురం మధురం మనోహరం రాధా మాధవ - ఎ. ఎమ్. రాజా
 మానస లాలస సంగీతం - ఎ. ఎమ్. రాజా
 సదసత్‌కళా క్షీరజల విభాగ క్రియానిపుణ - ఎ. ఎమ్. రాజా

వనరులు
 తెలుగు సినిమా పాటలు బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు)- సంకలనంలో సహకరించినవారు: జె. మధుసూదనశర్మ

ఆదుర్తి సుబ్బారావు దర్శత్వం వహించిన సినిమాలు
రేలంగి నటించిన సినిమాలు
ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. కృష్ణవేణి, భక్త కన్నప్ప వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన గోపీకృష్ణా మూవీస్ (కృష్ణంరాజు సొంత బానరు) తొలిసారిగా రాఘవేంద్రరావు, కృష్ణంరాజు కాంబినేషన్ లో ఈ చిత్రం నిర్మించింది.

నటీనటులు
 కృష్ణంరాజు
 జయసుధ
 మురళీమోహన్
 మాధవి
 ప్రభాకరరెడ్డి
 జయమాలిని
 సారథి
 రమాప్రభ
 సాక్షి రంగారావు
 సత్యనారాయణ
 ఝాన్సీ
 కె.జె.సారథి
 మాస్టర్ రాము
 మాడా
 విజయలక్ష్మి
 పొట్టి ప్రసాద్
 అపర్ణ
 జయకృష్ణ
 జూ.కాంచన
 రాళ్ళబండి కామేశ్వరరావు
 జి.ఎన్.స్వామి
 జగ్గారావు
 వీరభద్రరావు

చిత్రకథ
అనాధ ఐన కృష్ణంరాజును దొంగ తనం వృత్తిగా ఉన్న సత్యనారాయణ పెంచుతాడు. పెద్దవాడైన కృష్ణంరాజు ధనికుడౌతాడు. తన దగ్గర పనిచేసే జయసుధను ప్రేమిస్తాడు. ఐతే జయసుధ, మురళీమోహన్ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అంతే కాకుండా దుర్మార్గపు వృత్తిలో ఉన్న కృష్ణంరాజు అంటే జయసుధ ఇష్టపడదు.
కోపంతో మురళీమోహన్ ను చంపాలనుకున్న కృష్ణంరాజుకు (చిన్ననాటి ఫొటో ద్వారా) మాగంటి మురళీమోహన్ తన తమ్ముడని కృష్ణంరాజుకు తెలుస్తుంది. వారిద్దరికీ పెళ్ళి జరిపిస్తాడు. కాని జయసుధపై కృష్ణంరాజు యొక్క ఇదివరకటి ప్రేమ గురించి తెలుసుకొన్న మురళీమోహన్ అపార్ధంతో అతనిని ద్వేషిస్తాడు. జయసుధ కూడా అతనిని దూషిస్తుంది. ప్రేమించిన జయసుధ, తన వాళ్ళకోసం కృష్ణంరాజు ఆత్మహత్య చేసుకుని అమరదీపమౌతాడు.

పాటలు
చెళ్ళపిళ్ళ సత్యం సంగీత దర్శకత్వంలో రామకృష్ణ, సుశీల, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు చిత్ర విజయానికి తోద్పడ్డాయి.
 నా జీవన సంధ్యాసమయంలో ఒక దేవత ఉదయించింది గీతరచన: వేటూరి, గానం: వి.రామకృష్ణ, పి.సుశీల
 ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము గీతరచన: ఆత్రేయ, గానం: వి.రామకృష్ణ
 ఏ రాగమో ఇది ఏ తాళమో గీతరచన: ఆత్రేయ, గానం: ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
 కొత్తగా ఉందా గీతరచన: ఆత్రేయ, గానం: పి.సుశీల
 నీవే తల్లియు తండ్రియు గీతరచన: వేటూరి, గానం: పి.సుశీల
 అంతలేసి అందాలు దాచుకున్న అమ్మాయి - గీతరచన: ఆరుద్ర, గానం: వి.రామకృష్ణ, రమోల

మూలాలు

కృష్ణంరాజు నటించిన సినిమాలు
సత్యనారాయణ నటించిన చిత్రాలు
జయసుధ నటించిన సినిమాలు
రమాప్రభ నటించిన చిత్రాలు
జయమాలిని నటించిన సినిమాలు
శిల్పకళా ప్రావీణుడైన జక్కన్న జీవితచరిత్ర ఆధారంగా బి.ఎస్.రంగా 1964లో నిర్మించిన చారిత్రాత్మక చిత్రం అమరశిల్పి జక్కన. శిల్పకళకు ప్రాణంపోసే రాతిబండలపై సి.నారాయణరెడ్డి రచించిన ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో-ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో పాట ఇప్పటికీ ప్రజాదరణ చెంది మనల్ని ఆలోచింపజేస్తుంది.

సంక్షిప్త చిత్రకథ
మల్లన్న (నాగయ్య) గొప్ప శిల్పి. ఆయన కొడుకు జక్కన్న (అక్కినేని) తండ్రిని మించిన తనయుడు. అతడు నాట్యమయూరి మంజరి (బి.సరోజాదేవి)ని ప్రేమించి వివాహమాడతాడు. అయితే మంజరి అందచందాలను, నాట్య విన్యాసాన్ని అభిమానించిన రాజు గోపదేవుడు కుట్రపన్ని వారిద్దరినీ వేరుచేస్తాడు. 
దాని ఫలితంగా మంజరి తప్పనిసరి పరిస్థితుల్లో గోపదేవుని ముందు నృత్యం చేస్తుంది. దానిని చూసిన జక్కన్న, భార్యను అనుమానించి, వికల మనస్కుడై, విరాగియై, దేశాటన చేస్తాడు. తుదకు శ్రీరామానుజాచార్యుల సన్నిధిలో స్థిరపడతాడు.
మంజరి గోపదేవుని కుట్ర నుంచి బయటపడి, ఆత్మహత్యా ప్రయత్నంగా నీటిలో దూకి, జాలరులచే రక్షింపబడి, మగబిడ్డకు జన్మనిస్తుంది. అతడే డంకన్న (హరనాథ్). విరాగియైన జక్కన్న హోయాసల రాజు విష్ణువర్ధనుడు పాలించిన బేలూరులో శిల్పాలకు ప్రాణం పోస్తాడు. అతని శిల్పాలలో అతని భార్య మంజరి ప్రతిరూపం కనిపిస్తుంది.
అయితే జక్కన్న తీర్చిదిద్దిన ఒక శిల్పంలో లోపం వుందని సవాలు చేస్తాడు డంకన్న. ఫలితంగా ఆ శిల్పంలో కప్ప కనబడటం, అందుకు పరిహారంగా జక్కన్న తన చేతుల్ని నరుక్కుంటాడు.
పతాక సన్నివేశంలో తాత మల్లన్న, తండ్రి జక్కన్న, భార్య మంజరి మంజరి, కొడుకు డంకన్న పరస్పరం తెలుసుకోవటం, ఆ దేవదేవుడు కరుణించి జక్కన్నకు తిరిగి చేతులు ప్రసాదించడంతో కథ పరిసమాప్తవుతుంది.

పాత్రలు-పాత్రధారులు
అక్కినేని నాగేశ్వరరావు - జక్కన్న
బి.సరోజాదేవి - మంజరి
చిత్తూరు నాగయ్య - మల్లన్న, జక్కన్న తండ్రి
హరనాథ్ - డంకన్న, జక్కన్న కొడుకు
ఉదయకుమార్ - మహారాజు గోపదేవుడు
ధూళిపాళ
రేలంగి వెంకట్రామయ్య
గిరిజ
సూర్యకాంతం - రాజం, మంజరి తల్లి
పుష్పవల్లి 
ఎ.వి.సుబ్బారావు (జూనియర్)
చిరంజీవి బాబు
శకుంతల
హెచ్.బి.సరోజ
చిరంజీవి కాళేశ్వరి
రాజశ్రీ - నాట్యకత్తె

సాంకేతిక వర్గం
చిత్రం పేరు - అమరశిల్పి జక్కన్న (గేవా కలర్) 
దర్శకుడు, నిర్మాత - బి.యస్.రంగా
సంయుక్త దర్శకులు - టి.దయాసాగర్, కె.ధర్మరాజు
మాటలు - సముద్రాల రాఘవాచార్య
పాటలు - సముద్రాల రాఘవాచార్య, దాశరథి, కొసరాజు, సి.నారాయణ రెడ్డి
సంగీతం - యస్.రాజేశ్వరరావు
నేపథ్య గాయకులు - ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పి.సుశీల, బి.వసంత, స్వర్ణలత, పద్మ
నాట్యకర్తలు - జయలలిత, రతన్, రాజశ్రీ
కళ - ఎ. కె. శేఖర్
నిర్మాణసంస్థ - విక్రమ్ ప్రొడక్షన్స్
పంపిణీ - నవయుగ ఫిలిమ్స్ - విజయవాడ, గుంతకల్, మదరాసు, సికిందరాబాదు.
కూర్పు - పి.గి.మోహన్, యం.దేవేంద్రనాథ్, చక్రపాణి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - వి.కె.శ్రీనివాసన్
శిల్పం - వి.యస్.నటరాజన్
సెట్స్ - టి.యస్.మునుస్వామి, వడివేలు
స్టిల్స్ - కుప్పుస్వామి
ఎలక్ట్రీషియన్స్ - ఆర్.నఖేశన్, టి.కాళతి
పబ్లిసిటీ - స్టూడియో శర్మ, కె.వి.యస్., స్టుడియో కేతా, యస్.వి.కె.ఆర్.
నృత్య దర్శకులు - బి.హీరాలాల్, దండాయుధపాణీ, ఎ.కె.చోప్రా,సరస
స్టూడియో - విక్రమ్‌ స్టుడియో, మద్రాసు
కలర్ ప్రాసెసింగ్ - వాన్‌డెర్ ఔవేరా, ఫిలిం సెంటర్ (బొంబాయి)
అలంకరణ - హరిబాబు, పీతాంబరం, స్వర్ణప్ప, షణ్ముగం, విశ్వంబరన్ 
కేశాలంకరణ - జోసిఫిన్, రేబారాయ్
దుస్తులు - వి.యన్.మూర్తి, రహమాన్
ఛాయాగ్రహణం - బి.యస్.రంగా
శబ్దగ్రహణము - యన్.శేషాద్రి, బి.యస్.శామణ్ణ
రికార్డింగ్ సిస్టం - ఆర్.సి.ఎ. సౌండ్ సిస్టం

పాటలు

మురిసేవు విరిసేవు. సముద్రాల. ఘంటశాల

తరమా వరదా కొనియాడ . సముద్రాల.ఘంటశాల, సుశీల.

.

విశేష. ఘంటశాల.ాలు
ఇదే చిత్రాన్ని బి.ఎస్.రంగా 'అమరశిల్పి జక్కనాచార్య' అనే పేరుతో ఒకేసారి కన్నడంలో కూడా నిర్మించారు. అక్కినేని పోషించిన జక్కన్న పాత్రను కన్నడంలో కళ్యాణకుమార్ వేశారు. రెండు భాషలలో మంజరిగా బి.సరోజాదేవి నటించారు.
తెలుగు చిత్రానికి రాష్ట్రపతి యోగ్యతాపత్రం లభించింది.

మూలాలు
శిల్పకళకు ప్రాణం పోసిన చిత్రం "అమరశిల్పి జక్కన్న", నాటి 101 చిత్రాలు, ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006, పేజీలు 203-04.
సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.

అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు
తెలుగు జీవితచరిత్ర సంబంధమైన చిత్రాలు
రేలంగి నటించిన సినిమాలు
సూర్యకాంతం నటించిన సినిమాలు
ధూళిపాళ నటించిన చిత్రాలు
నాగయ్య నటించిన సినిమాలు
బి.సరోజాదేవి నటించిన సినిమాలు
గుడ్డివాడైన వయొలిన్ కళాకారుడుగా కమల్ హాసన్, అతని జీవితచరిత్రను ప్రాచుర్యం చేసి తద్వారా అనేక మంది వికలాంగులకి స్ఫూర్తి కలిగించాలని నడుంకట్టుకున్న సహచరి గా మాధవి నటించిన ఒక విలక్షణమైన చిత్రమిది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన రాజా పార్వై అనే తమిళ మాతృకకు తెలుగు సేత. ఈ తమిళ చిత్రం లో ఒక పాటకు బాలసుబ్రహ్మణం జాతీయ ఉత్తమ గాయకుడిగా బహుమతి గెలుచుకున్నాడు.

కథ

నటవర్గం 
 కమల్ హాసన్
 మాధవి
 ఎల్.వి.ప్రసాద్
చిత్ర

సాంకేతికవర్గం 
దర్శకత్వం : సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత : రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్ నేషనల్ (హాసన్ బ్రదర్స్) 
సంగీతం : ఇళయరాజా

మూలాలు

బయటి లంకెలు 
 

ఇళయరాజా సంగీతం అందించిన చిత్రాలు

1981 తెలుగు సినిమాలు
కమల్ హాసన్ నటించిన చిత్రాలు
మాధవి నటించిన సినిమాలు
అమాయక చక్రవర్తి 1983లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వల్లభనేని జనార్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  చంద్రమోహన్, విజయశాంతి, జయమాలిని, కృష్ణవేణి, నూతన్ ప్రసాద్ నటించగా, కృష్ణ చక్ర సంగీతం అందించారు.

నటవర్గం 
 చంద్రమోహన్
 విజయశాంతి
 జయమాలిని
 కృష్ణవేణి
 నూతన్ ప్రసాద్

సాంకేతికవర్గం 
 దర్శకత్వం: వల్లభనేని జనార్ధన్
 సంగీతం: కృష్ణ చక్ర
 నిర్మాణ సంస్థ: లలనీ చిత్ర

పాటలు
ఈ చిత్రంలోని పాటలకు కృష్ణ-చక్ర సంగీతం అందించారు. 
  అందని అందం అందానికే ఒక అందం అందక  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: శివదత్త
 చూడరా నీ ముద్దుల చిలకా చూడరా నీ పెంపుడు - ఎస్.పి. బాలు - రచన: శివదత్త
 మానస సరోవరం ఈ మనసను తలపే మానస- ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: శివదత్త
 వీణ వీణ ప్రణయరాగభరిత వనిత  ప్రాణమున్నవీణ - ఎస్.పి.బాలు,పి. సుశీల - రచన: శివదత్త
 వేదాంతమేమన్నాను నిలబడితే అది  - ఎస్.పి. బాలు - రచన: శివదత్త
 సత్తిరాజుగారు తమరు సుత్తివేసుకోండి - ఎస్.పి. శైలజ - రచన: వేటూరి

మూలాలు 

తెలుగు కుటుంబకథా చిత్రాలు
చంద్రమోహన్ నటించిన సినిమాలు
విజయశాంతి నటించిన చిత్రాలు
నూతన్ ప్రసాద్ నటించిన చిత్రాలు
జయమాలిని నటించిన సినిమాలు
1971 వ సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపిక చేసి కాంస్య నంది అవార్డు ప్రకటించింది.

పాటలు

మూలాలు
సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007. 
ఘంటసాల గళామృతము.కాం

నంది ఉత్తమ చిత్రాలు
అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు
రావి కొండలరావు నటించిన చిత్రాలు
కాంచన నటించిన సినిమాలు
నాగభూషణం నటించిన సినిమాలు
గుమ్మడి నటించిన చిత్రాలు
రమాప్రభ నటించిన చిత్రాలు
అమాయకుడు సినిమా 1968 మే 10వ తేదీన విడుదలయ్యింది. ప్రముఖ హాస్యనటుడు అడ్డాల నారాయణరావు దీనికి దర్శకుడిగా పనిచేశాడు. దర్శకునిగా ఇది ఇతని రెండవ సినిమా.  ఈ చిత్రానికి మూలం 1959లో వచ్చిన అనారీ హిందీ చిత్రం.

సాంకేతిక వర్గం
 సంభాషణలు- రావూరి 
 కథ- ఇందిరారాజ్ ఆనంద్
 కళ- సూరన్న
 కూర్పు- కె.ఏ.శ్రీరాములు
 ఫొటోగ్రఫీ- ఎం.కె. రాము 
 పోరాటాలు- రాఘవులు అండ్ పార్టీ 
 నృత్యం- చిన్ని, సంపత్, వి.జె.శర్మ 
 సంగీతం- బి.శంకర్ 
 దర్శకత్వం- అడ్డాల నారాయణరావు 
 నిర్మాతలు- ఉదయశ్రీ (మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్).

నటీనటులు
 కృష్ణ
 జమున
 గుమ్మడి
 జి.వరలక్ష్మి
 విజయలలిత
 ముక్కామల
 రేలంగి
 అల్లు రామలింగయ్య

కథ
రాజు (కృష్ణ) నీతి, నిజాయితీగల విద్యాధికుడైన, ఒక పెయింటర్, తల్లి, తండ్రి ఎవరూ లేని అనాథ. మేరియమ్మ (జి.వరలక్ష్మి) ఇంట్లో అద్దెకు వుంటున్నాడు. ఎక్కడ ఏ పనిలో ఉద్యోగంలో చేరినా అచ్చట మోసాలు తట్టుకోలేక, ఉద్యోగాలు వదిలివేస్తుంటాడు. జాలి హృదయం గల మేరియమ్మ అతణ్ణి మందలిస్తూనే, అతని పోషణ భారం వహిస్తుంది. చిత్రాలు గీసి డబ్బులు సంపాదించమని, వాటికి తనే డబ్బు చెల్లిస్తుంటుంది. ఒకరోజు అనుకోకుండా రాజు, ఆ వూరిలో ధనవంతుడు, రామనాథ్ (గుమ్మడి) తమ్ముని కూతురు రాణి (జమున)ని కలుసుకుంటాడు. ఆమె అతనికి సాయం చేయాలని అతనితో చిత్రం గీయించుకుంటానని, పిలిచి, తన స్నేహితురాలు (పనిమనిషి) ఆశ (విజయలలిత)ను రాణిగా చెప్పి, అతనితో తమాషా చేస్తుంది. ఆపైన అతన్ని ప్రేమిస్తుంది. రాజుకూడా ఆమె పేద పిల్ల అని ప్రేమిస్తాడు. ఒకసారి డబ్బుతో పర్స్ పోగొట్టుకున్న రామనాథంకి దాన్ని తెచ్చి ఇచ్చిన రాజు నిజాయితి మెచ్చి, అతనికి తన ఆఫీసులో ఉద్యోగం ఇస్తాడు. ఆ కంపెనీలో అతనికి ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఇంతలో రాజు, తన తమ్ముని కుమార్తె రాణిని ప్రేమించాడని తెలిసి రామనాథం ఆమెనుండి అతన్ని దూరం చేయాలని రాణిని మందలిస్తాడు. ఈలోపు ఆ కంపెనీలో తయారైన కల్తీ మందుల వలన జ్వరంతో బాధపడుతున్న మేరియమ్మ వాటిని రాజు ద్వారా వాడడంవల్ల దాంతో ఆమె మరణిస్తుంది.

హత్యానేరంపై జైలుపాలయిన రాజును రక్షించటానికి రాణి ప్రయత్నించటం, దాన్ని విఫలం చెయ్యాలని రాణి బాబాయి రామనాథం అడ్డుకోవటం, చివరికి కోర్టులో రామనాథం తన తప్పులను ఒప్పుకోవటంతో అతను అరెస్ట్‌కాబడి, రాజు నిర్దోషిగా బయటకు వస్తాడు. రాణి, రాజుల వివాహంతో చిత్రం సుఖాంతమౌతుంది.

పాటలు
 అనుకోనా ఇది నిజమనుకోనా కలయనుకోనా - పి.బి. శ్రీనివాస్ - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
 చందమామ రమ్మంది చూడు, చల్లగాలి రమ్మంది చూడు - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సి.నారాయణరెడ్డి
 పట్నంలో శాలిబండ పేరైన గోల్‌కొండ చూపించు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఎ. వేణుగోపాల్
 పూవులలో తీవెలలో పొంగెనులే అందాలే - పి.సుశీల బృందం - రచన: డా. సి.నారాయణరెడ్డి
 పోలేవు నీవు రాలేను నేను నీదారిలోనే నే దాగినాను - పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
 బొమ్మను గీసేవు ముద్దుల బొమ్మను గీసేవు - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
 మనిషైతే మనసుంటే కనులు కరగాలిరా - ఘంటసాల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి

మూలాలు

 సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
 ఘంటసాల గళామృతంలో అమాయకుడు సినిమా పాటల వివరాలు

బయటి లింకులు
 

ముక్కామల నటించిన సినిమాలు
ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
గుమ్మడి నటించిన చిత్రాలు
రేలంగి నటించిన సినిమాలు
అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు
అమయకుడు కాదు అసాధ్యుడు 1983లో విడుదలైన తెలుగు సినిమా. శశిరేఖా మూవీస్ పతాకంపై పి.బాబ్జీ నిర్మించిన ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వం వహించింది. కృష్ణ, జయసుధ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

తారాగణం

సాంకేతిక వర్గం 

 బ్యానర్: శశిరేఖా మూవీస్
 సమర్పణ: డూండీ
 కథ: డూండీ
 మాటలు: కె.అప్పలాచార్య
 పాటలు: ఆరుద్ర, కొసరాజు, వేటూరి సుందరరామమూర్తి, అప్పలాచార్య, నెల్లుట్ల
 నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, రమోలా
 కళ: కోదండం
 స్టిల్స్: గంగాధర్
 పోరాటాలు: రాఘవులు, రాజు
 ఆపరేటివ్ ఛాయాగ్రహణం: సి.గోపాలరావు
 నృత్యం: శ్రీనివాస్
 కూర్పు:డి.వెంకటరత్నం
 సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
 ఛాయాగ్రహణం: పుష్పాల గోపీకృష్ణ
 నిర్మాత: పి.బాబ్జీ
 చిత్రానువాదం, దర్శకత్వం: విజయనిర్మల

పాటలు
 అల్లిబిల్లి లోకం ఆశతీరే లోకం పొంగుతున్న - ఎస్.పి. బాలు, ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
 ఇదేరా లోకం తీరు వృధారా నీ కన్నీరు స్వార్ధంలో - ఎస్.పి. బాలు - రచన: డా. నెలుట్ల
 ఏమిటో ననుకుంటి ఇదా అరె విన్నానులే అసలు కథ - ఎస్.పి. బాలు, రమోల - రచన: కొసరాజు
 చీర దోచాడు సిగ్గు దోచాడు ఆనాటి ఆ కృష్ణుడు - పి. సుశీల, ఎస్.పి. బాలు
 రామా రమేశా లక్ష్మి ..మము పాలింపగ - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: అప్పలాచార్య
 సింహబలుడనేనే అనుభవించుతానే ఓ లలనా - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం

మూలాలు

బయటిలింకులు
 
 ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

సుత్తి వీరభద్రరావు నటించిన సినిమాలు
ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
సుత్తి వేలు నటించిన సినిమాలు
సత్యనారాయణ నటించిన చిత్రాలు
జయసుధ నటించిన సినిమాలు
ఆమె (She) అనేది తెలుగు భాషలో ఒక మూలపదం. వ్యాకరణపరంగా ఈ పదం ప్రధమ పురుషలో ఒక స్త్రీని ఉద్దేశించి చెప్పడానికి వాడే సర్వనామము.

పద ప్రయోగం
ఈ పదమును ఒక ఆడమనిషిని వేరొకరికి మూడవ మనిషి (Third person) గా చెప్పే సందర్భములో ఉపయోగిస్తారు. క్రింది సందర్భాల వలె. ఉదా: ఆమె చెప్పింది, ఆమె చేసింది, ఆమె వెళ్ళింది.

రూపాంతరాలు
 ఆవిడ, ఆయమ్మ
 అది (కొన్నిసార్లు నిందాత్మకంగా కూడా)

ఇతర విశేషాలు
 ఈ పిలుపుతో తెలుగులో కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇ. వి. వి. సత్యనారాయణ ధర్శకత్వంలో ఊహ కథానాయకిగా ఆమె పేరుతో ఒక సినిమా నిర్మించారు.

సర్వనామములు

zh:三千年豔屍記
ఆమె ఎవరు? 1966, అక్టోబర్ 20న విడుదలైన తెలుగు చలనచిత్రం.

తారాగణం
 కొంగర జగ్గయ్య. (డా. ఆనంద్)
 జయలలిత  
 వాణీశ్రీ
 నాగభూషణం
 ప్రభాకరరెడ్డి
 కె.మాలతి
 రాజబాబు
 బి.వి.రాధ

పాటలు
అందాల ఈ రేయి పలుమారు రాదోయి జాగుచేయకోయి - సుశీల
ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా - సుశీల
కన్నె మనసు దోచుకున్న మావయ్య ఈ చిన్నదాని కనికరించవేమయ్యా - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
నీ కన్నులలో నా కన్నీరే వింతగా పొంగి రానేలా - సుశీల
నీవు చూసే చూపులో ఎన్నెన్ని అర్ధాలు ఉన్నవో - పి.బి.శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి

వనరులు
డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

మూలాలు 

జగ్గయ్య నటించిన సినిమాలు
జయలలిత నటించిన సినిమాలు
అమెరికా అబ్బాయి 1987, జనవరి 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. అన్నపూర్ణా పిక్చర్స్ పతాకంపై
దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాణ సారథ్యంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్టర్ శ్రావణ్ శంకర్, రాజశేఖర్, రాధిక నటించగా సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను యునైటెడ్ స్టేట్స్ లోని చికాగోలో, న్యూయార్క్ లోని హుర్లీ మెడికల్ సెంటర్ లో చిత్రీకరించారు.

నటవర్గం 

 మాస్టర్ శ్రావణ్ శంకర్
 కైకాల సత్యనారాయణ
 రాజశేఖర్
 చరణ్ రాజ్
 రాధిక
 గుమ్మడి వెంకటేశ్వరరావు
 అశ్విని
 వై.జి.మహేంద్రన్
 గుణశేఖర్
 సుష్మ
 మంజు
 చంద్రమోహన్ (అతిథి నటుడు)
 ఎలిజబెత్ (అతిథి నటి)

సాంకేతికవర్గం 
 దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
 నిర్మాత: దుక్కిపాటి మధుసూదనరావు
 కథ: జీడిగుంట రామచంద్ర మూర్తి
 చిత్రానువాదం: సింగీతం శ్రీనివాసరావు, దుక్కిపాటి మధుసూదనరావు
 మాటలు: ఆర్.వి.ఎస్. రామస్వామి
 సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
 ఛాయాగ్రహణం: హరి అనుమోలు
 కూర్పు: ఎం.ఎస్. మణి, కె. గోవిందు
 నిర్మాణ సంస్థ: అన్నపూర్ణా పిక్చర్స్
 పంపిణీదారు: జయలక్ష్మి మూవీస్

పాటలు 
ఈ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించాడు. ఆరుద్ర, సి. నారాయణరెడ్డి పాటలు రాసారు.

మూలాలు

ఇతర లంకెలు 
 

సింగీతం శ్రీనివాసరావు సినిమాలు
1987 తెలుగు సినిమాలు
రాజశేఖర్ నటించిన చిత్రాలు
సత్యనారాయణ నటించిన చిత్రాలు
చంద్రమోహన్ నటించిన సినిమాలు
గుమ్మడి నటించిన చిత్రాలు
అమెరికా అల్లుడు 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, భానుప్రియ, కాంతారావు నటించారు. కె. చక్రవర్తి సంగీతం అందించాడు. చికాగో ఫిలింస్ పతాకంపై వేమూరి రమేశ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

కథ 
అమెరికా అల్లుడు అనేది కుటుంబ ఆధారిత చిత్రం. ఇందులో చికాగోలో గుర్తింపు పొందిన డాక్టర్ డాక్టర్ రాజు (సుమన్) పల్లెటూరుకి చెందిన తన మరదలు రాధా (భానుప్రియ) ను వివాహం చేసుకున్నాడు.

వివాహం తర్వాత వారు యుఎస్‌ఎకు వచ్చినప్పుడు, రాధా మొదట్లో పాశ్చాత్య దేశాల కొత్త జీవనశైలికి సర్దుబాటు చేయలేకపోతుంది. అమాయకత్వం, అజ్ఞానం కారణంగా తలెత్తిన తప్పులతో రాజును తరచూ చికాకు పడతాడు.

ఆమె చేసిన పొరపాటు వల్ల, ఆసుపత్రిలో రాజు రోగులలో ఒకరు చనిపోతారు. కలత చెందిన రాజు రాధను విడిచిపెట్టాడు. రాధ వదలిపెట్టిన భార్యగా భారతదేశానికి వెళ్లడం ఇష్టం లేక యుఎస్ఎలో కొనసాగాలని నిర్ణయించుకుంటుంది.

ఆమె తన కాళ్ళ మీద నిలబడి తన బిడ్డను ఎలా చూసుకుంటుంది? చివరికి రాజు హృదయాన్ని ఎలా గెలుచుకుంటుంది? అనేది హృదయపూర్వక పద్ధతిలో ఈ సినిమా నిర్మించబడింది.

నటవర్గం 
 సుమన్
 భానుప్రియ
 కాంతారావు
 కిమ్
 తంబు
 సూర్యకాంతం
 అప్పారావు
 జానకి 
 రాజు
 పద్మ, ప్రసన్న, సుజాత (చికాగో నటీమణులు)
 చౌదరి, జాన్ జోన్స్, (చికాగో నటులు)
 కె.వాసు

సాంకేతికవర్గం 
 దర్శకత్వం: కె.వాసు
 సంగీతం: కె. చక్రవర్తి
 నిర్మాణ సంస్థ: చికాగో ఫిల్మ్స్
 కథ: వేల్చేరు నారాయణరావు
 మాటలు: సత్యానంద్
 పాటలు: వేటూరి సుందరరామమూర్తి
 నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, పి.సుశీల
 స్టిల్స్: శివాజీ
 నృత్యం: శేషు
 పోరాటాలు: జూడోరత్నం
 ఆపరేటివ్ ఛాయాగ్రహణం: జి.వి.సుబ్బారావు, బాబూ భాషా
 కళ: బి.ఎన్.కృష్ణ
 కూర్పు: నాయని మహేశ్వరరావు
 ఛాయాగ్రహణం: ఎం.వి.రఘు
 సంగీతం: చక్రవర్తి
 నిర్మాణత: వేమూరి శ్రీలత
 నిర్మాత: వేమూరి రమేశ్
 చిత్రానువాదం, దర్శకత్వం: కె.వాసు

మూలాలు

బాహ్య లంకెలు 
 

తెలుగు కుటుంబకథా చిత్రాలు
పాశ్చాత్య ధోరణుల పట్ల వెర్రి వ్యామోహం పెంచుకొనే యువతకు మన నాగరికత విశిష్టతను గుర్తు చేసే ఈ చిత్రం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సినిమాలలో ఒక ముఖ్యమైన చిత్రం. అమెరికానుండి తిరిగి వస్తూ ఒక యువకుడు (శ్రీధర్) 'డెబొరా' అనే ఒక అమెరికా అమ్మాయిని పెళ్ళి చేసుకొని వెంటతీసుకొస్తాడు. ఆ కుర్రవాని పెళ్ళికై పెద్దవాళ్ళు అనుకొన్న ఆశలు వమ్ము కాగా వారు మనస్తాపానికి గురౌతారు.
క్రమంగా ఆ డెబొరా 'దేవి'గా మారి తెలుగు కట్టు, బొట్టు, మాట, పాటలు అలవరచుకొని అందరినీ ఆకట్టుకోవడం ఈ చిత్ర కథాంశం.

కొన్ని విశేషాలు
 ఈ చిత్రాన్ని ఎంతో శ్రమకోర్చి తీశారు. ముందుగా ఒక పాశ్చాత్య యువతిని 'అమెరికా అమ్మాయి'గా ఎంపిక చేయగా ఆమె మధ్యలో (వీసా సమస్య వల్ల) దేశంనుండి నిష్క్రమించింది. అప్పుడు ఆన్నే షేమోటీ (Anne Chaymotty) అనే 'ఫ్రెంచి వనిత'ను 'అమెరికా అమ్మాయి'గా తీసుకొన్నారు. ఆమెకు నాట్యంలో విశిష్టమైన శిక్షణ ఇచ్చారు (వెంపటి చినసత్యం?)
 కథానాయిక చిదంబర దేవస్థానం మండపంలో 'ఆనంద తాండవమాడే శివుడు' పాటకు అద్భుతంగా నర్తించింది. 
 స్టేజిమీద యువతీయువకులు (దీప, రంగనాధ్ వగైరా) 'లవ్ మి లవ్ మి లవ్ మి' అనే ఇంగ్లీషు పాటకు డాన్స్ చేస్తారు. ఇలా ఇంగ్లీషు వారెవరైనా తెలుగు పాట ప్రదర్శించలేరు అని రంగనాధ్ సవాలు చేయగా 'అమెరికా అమ్మాయి' "పాడనా తెలుగు పాట" అనే పాట పాడుతుంది. ఈ పాట ఊరూరా మారుమ్రోగింది.
 తరువాత ఆన్నే షేమోటీ "దేవయాని" అనే పేరుమీద ప్రసిద్ధ భరతనాట్య నర్తకి అయ్యింది. ఆ వివరాలు ఇక్కడ, ఆమెతో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ చూడవచ్చును.

పాటలు

మూలాలు
డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

సింగీతం శ్రీనివాసరావు సినిమాలు
రమాప్రభ నటించిన చిత్రాలు
అమెరికా రాముడు 1980లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వందన నరసిజ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించబడింది.

మూలాలు
అమ్మ 1939లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీరాజ్యం ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం 1939 మార్చి 16న విడుదలైంది. అరోరా ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి నిరంజన్ పాల్ దర్శకుడు. స్క్రిప్ట్ కూడా ఆయనే సమకూర్చారు. దర్శకుడు నిరంజన్ పాల్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ నాయకుడు అయిన బిపిన్ చంద్ర పాల్ కుమారుడు.

అమ్మ’ సినిమా తారాగణం, మిగతా సాంకేతిక నిపుణుల గురించిన సమాచారం అందుబాటులో లేదు. ఈ సినిమాని 1939 మార్చి 16న సెలెక్ట్ టాకీస్ (విశాఖపట్నం), క్రౌన్ టాకీస్ (కాకినాడ), ఇంపీరియల్ టాకీస్ (సికింద్రాబాద్)లో విడుదల చేశారు.

విశాఖపట్నం సెలెక్ట్ టాకీస్‌లో ఈ సినిమాని విడుదల చేసిన రోజు అప్పటి ఆంధ్రా యూనివర్సిటీ వై చాన్సలర్ సి.ఆర్. రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు.

తారాగణం 

 సి. లక్ష్మీ రాజ్యం
 పి.శాంతకుమారి

సాంకేతిక వర్గం 

 దర్శకత్వం; నిరంజన్ పాల్
 నిర్మాత: దాసరి కొట్టిరత్నం

మూలాలు

బాహ్య లంకెలు
అమ్మ 1975లో విడుదలైన తెలుగు చలనచిత్రం. మాతృశ్రీ పబ్లికేషన్స్ ట్రస్టు పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్.ఎన్.మూర్తి దర్శకత్వం వహించగా, సుసర్ల దక్షిణామూర్తి, పామర్తి సంగీతాన్నందించారు.

నటవర్గం

సాంకేతికవర్గం 
 దర్శకత్వం: ఎమ్. ఎస్. ఎన్. మూర్తి
 సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి, పామర్తి
 నిర్మాణ సంస్థ: మాతృశ్రీ పబ్లికేషన్స్ ట్రస్ట్

పాటలు 

 అందాల లీలలో ఆనందంబౌ - ఘంటసాల - రచన: ప్రసాద రాయ కులపతి.
 ఆడుతు పాడుతు నీ కథ - ఘంటసాల - రచన: బుచ్చిరాజు శర్మ
 ఐంద్రీ మహావిద్య యను పేర - ఘంటసాల - రచన: బుచ్చిరాజు శర్మ
 అంతా రామమయం - అవధూతేంద్ర సరస్వతీ స్వామీజి - రచన: భక్త రామదాసు
 అల్లదే హైమాలయం అది చల్లని నీ దేవాలయం - ఎస్. జానకి - రచన: నదీరా
 అయిభుది నందిని భూసుర నందిని - ఎస్. జానకి - రచన: పన్నాల రాధాకృష్ణశర్మ
 అన్నదాతా సుఖీభవ అనసూయమాతా సుఖీభవ - పి.సుశీల  - రచన: నదీరా
 ఉదయమిదే మాతృశ్రీ స్వర్ణోత్సవ మహోదయమిదే - ఎస్.పి. బాలు - రచన: నదీరా
 ఎంత దూరమమ్మా యీ పయనం - వి. రామకృష్ణ - రచన: మన్నవ బుచ్చిరాజుశర్మ
 ఏమి వర్ణింతువోయి నీవు - ఘంటసాల - రచన: పి. రాయకులపతి
 కనుగొంటినా లేక కలగంటినా - ఎస్. జానకి - రచన: నదీరా
 జిల్లెల్లమూడిలో స్త్రీరూప ధారణియై దిగివచ్చి - ఎస్. జానకి - రచన: శంకరశ్రీ
 దీపావళీ దివ్య దీపావళీ ఇది మాపాలి ఆనంద - పి.సుశీల - రచన: బి.ఎల్.ఎన్. ఆచార్య
 పుణ్యమహో పుణ్యమహో పుణ్యం తవ దర్శనం - పి.లీల - రచన:పన్నాల రాధాకృష్ణశర్మ
 మేలుకొలుపు - మంగళంపల్లి బాలమురళీకృష్ణ - రచన: పన్నాల రాధాకృష్ణశర్మ
 యయా శక్త్వా బ్రహ్మా (శ్లోకం) - ఘంటసాల - రచన: శంకరశ్రీ

మూలాలు
అమ్మా దుర్గమ్మ 1996లో విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఎ.ఆర్ట్స్ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రానికి ఓం సాయి ప్రకాష్ దర్శకత్వం వహించాడు. శశికుమార్, ఊహ, రంగనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.

తారాగణం 

 శశి కుమార్
 ఊహ
 రంగనాథ్
 ప్రసాద్ బాబు
 నర్రా వెంకటేశ్వరరావు
 రామిరెడ్డి
 తనికెళ్ళ భరణి
 బాబూ మోహన్
 వై.విజయ
 డబ్బింగ్ జానకి
 జీవ
 ఉత్తేజ్
 సుబ్బరాయశర్మ
 భానుప్రియ - దుర్గమ్మ పాత్రలో

సాంకేతిక వర్గం 

 సమర్పణ: కె.మహేంద్ర
 బ్యానర్: ఎ.ఎ.ఆర్ట్స్
 మాటలు: విమలా గణేష్, దాసం వెంకట్రావు
 పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల, గుండవరపు సుబ్బారావు
 నేపథ్యగానం:ఎస్.జనకి, నాగూర్‌బాబు, ఎస్.పి.శైలజ, స్వర్ణలత, శ్రీలత, వందేమాతరం శ్రీనివాస్
 స్టిల్స్: ఇ.వి.వి.గిరి
 ఆపరేటివ్ ఛాయాగ్రహణం: సేతురామన్, నారాయణ
 నిర్వహణ:జె.ఉదయ్ కుమార్
 కో డైరక్టరు: రావు గోపాలరావు
 కళ: పింజల వెంకటేశ్వరరావు
 నృత్యాలు: గిరిజా రఘురాం, శేషు
 కూర్పు: నాయని మహేశ్వరరావు
 సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
 ఛాయాగ్రహణం: జానీలాల్
 కథ, చిత్రానువాదం దర్శకత్వం: ఓం సాయి ప్రకాష్

మూలాలు

బాహ్య లంకెలు 

రావు గోపాలరావు నటించిన చిత్రాలు
అమ్మా అమ్మను చూడాలనివుంది 1996లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, రమ్యకృష్ణ, చంద్రమోహన్, మంజుల, జె.వి. సోమయాజులు, బ్రహ్మానందం నటించగా, కోటి సంగీతం అందించారు.

నటవర్గం 
 వినోద్ కుమార్,
 రమ్యకృష్ణ
 చంద్రమోహన్
 మంజుల
 జె.వి. సోమయాజులు
 బ్రహ్మానందం

సాంకేతికవర్గం 
 దర్శకత్వం: సాగర్
 సంగీతం: కోటి
 నిర్మాణ సంస్థ: శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్

మూలాలు 

తెలుగు కుటుంబకథా చిత్రాలు
కోటి సంగీతం అందించిన చిత్రాలు
వినోద్ కుమార్ నటించిన చిత్రాలు
రమ్యకృష్ణ నటించిన చిత్రాలు
చంద్రమోహన్ నటించిన సినిమాలు
బ్రహ్మానందం నటించిన సినిమాలు
అమ్మా నాగమ్మ 1996, జూన్ 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఓం సాయి ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఊహ, ప్రకాష్ రాజ్, పి.ఎల్. నారాయణ, రామిరెడ్డి, రంగనాథ్ నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.

నటవర్గం 
 ఊహ
 ప్రకాష్ రాజ్
 పి.ఎల్. నారాయణ
 రామిరెడ్డి
 రంగనాథ్

సాంకేతికవర్గం 
 దర్శకత్వం: ఓం సాయి ప్రకాష్
 సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
 నిర్మాణ సంస్థ: ఎ.ఎ. ఆర్ట్స్

మూలాలు 

వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన చిత్రాలు
తెలుగు కుటుంబకథా చిత్రాలు
ప్రకాష్ రాజ్ నటించిన చిత్రాలు
రంగనాథ్ నటించిన చిత్రాలు
పి.ఎల్.నారాయణ నటించిన సినిమాలు
ఈ సినిమాకు హిందీ సినిమా "మా" ఆధారం.  ఈ సినిమాను అంకయ్య గౌడ్, ఆనందనాయుడులు నిర్మించారు.

నటీనటులు
 రజనీకాంత్
 మోహన్‌బాబు
 శ్రీప్రియ
 అల్లు రామలింగయ్య
 నాగభూషణం
 కె.వి.చలం
 అంజలీదేవి
 రమాప్రభ
 జయమాలిని
 నగేష్
 మేజర్ సుందరరాజన్
 వై.జి.మహేంద్రన్

సాంకేతిక స్వర్గం
 కథ, స్క్రీన్ ప్లే: శాండో ఎం.ఎం.ఎ.చిన్నప్ప దేవర్
 దర్శకత్వం: ఆర్.త్యాగరాజన్
 మాటలు, పాటలు : ఆత్రేయ
 సంగీతం : ఇళయరాజా
 ఛాయాగ్రహణం: సుందరం
 కూర్పు : బాలు

పాటలు
 అమ్మా నీవు లేని నేను మోడైన మాను నా కళ్ళలో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 ఇదే నా మొదటి ప్రేమ లేఖా రాశానే మనసు దాచలేక - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
 ఈ వేళా ఇదే ఏమిటో ఇదే ఏమిటో నా మది నీ మది  కాగా - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 గున్నమావి కొమ్మమీద గుబులుగున్న కోకిలమ్మ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 చిన్న మావా చిట్టి బావా ఓ ఓ నా కొకడే చందమామ - ఎస్.జానకి
 నాయకా వినాయక బుజ్జి బొజ్జ నాయక తీయరా గుంజీలు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి
 ప్రేమ బేరం తీపి నేరం నింగిలో వెన్నెల జల్లు గుండెలో నాటెను - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

బయటి లింకులు
 ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 

కె.వి.చలం నటించిన సినిమాలు
జయమాలిని నటించిన సినిమాలు


నటీనటులు
 జయంతి - డాక్టర్ మాధవి
 చలం - రాజు
 భారతి - శుభ చెల్లి
 కైకాల సత్యనారాయణ
 శుభ - సత్యనారాయణ భార్య
 కె.విజయ
 చలపతిరావు

పాటలు
 అరె చిక్ చిక్ చిక్ చిక్ రైలుబండి అది చకచక వెళ్తు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
 ఎన్నేళ్ళమ్మా ఎన్నేళ్ళు చిన్నారి బాబుకు - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
 ఎవరు ఎవరు ఎవరురా పెద్దవాడు ఎవరు ఎవరు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: డా. సి.నారాయణరెడ్డి
 ఏమిటమ్మా అంతకోపం ఎవరిమీద ఎందుకోసం - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సి.నారాయణరెడ్డి
 జో అచ్యూతానంద జొ జొ ముకుందా లాలి పరమానంద లాలి (బిట్) - పి. సుశీల
 పశువైనా పక్షయినా మనిషైనా మాకైనా అమ్మమనసు ఒకటే - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: వీటూరి
 శ్రీశైల భవనా మేలుకో శ్రితచిత్త సదనా మేలుకొ - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
 సుప్రభాతము శుభకరము సుప్రభాతము - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల బృందం - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి

కె. విశ్వనాధ్ దర్శకత్వం వహించిన సినిమాలు
చలం నటించిన చిత్రాలు
సత్యనారాయణ నటించిన చిత్రాలు
అమ్మమాట 1972 లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి వి. రామచంద్రరావు దర్శకత్వం వహించగా, మహానటి సావిత్రి అమ్మగా నటించారు. ఈ సినిమాలో  ఎంతబాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా  అనే పాటను దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించగా; రమేష్ నాయుడు బాణీలను అందించగా, సావిత్రి, చిన్నారి శ్రీదేవి లపై చిత్రీకరించారు.

పాత్రలు-పాత్రధారులు
 సావిత్రి - లక్ష్మి
 శోభన్ బాబు - రఘు
 వాణిశ్రీ - శోభ
 చిత్తూరు నాగయ్య - జగన్నాథరావు
 నాగభూషణం - పుణ్యమూర్తి
 సత్యనారాయణ - ఆనంద్
 అల్లు రామలింగయ్య - కైలాసం/చక్రవర్తి
 రాజబాబు - రాజు
 శ్రీదేవి (బాలనటి)
 ఎం.ప్రభాకర్‌రెడ్డి - శ్రీనివాసరావు
 మాస్టర్ శేఖర్
 బాలిరెడ్డి సుబ్బారావు
 ఎస్.వి.జగ్గారావు
 సత్తిబాబు
 లీలారాణి - 
 జ్యోతిలక్ష్మి
 లత
 రాజేశ్వరి
 వంగా అప్పారావు

పాటలు
 ఎంత బాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా -గానం: పి.సుశీల బృందం; రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
 ఎందుకమ్మా ఆపుతావు ఏమిటమ్మా నీ నమ్మకము - ఘంటసాల
 ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండి సార్ ఈరోజు - పి.సుశీల - డా. సినారె
 ఎవరైనా చూశారా ఏమనుకుంటారు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, బి. వసంత - డా. సినారె
 మాయదారి సిన్నోడి మనసే లాగేసిండు - ఎల్. ఆర్. ఈశ్వరి - డా. సినారె
 సద్దుమణగనీయవోయి చందురుడా ముద్దు - ఎస్. జానకి - డా. సినారె
 సా...రీ....సరిగదా పాలిష్ బూట్ పాలిష్ ముసలి బూట్లకు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: కొసరాజు

మూలాలు

డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
 

సావిత్రి నటించిన సినిమాలు
శోభన్ బాబు నటించిన సినిమాలు
రాజబాబు నటించిన సినిమాలు
నాగయ్య నటించిన సినిమాలు
నాగభూషణం నటించిన సినిమాలు
అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు
శ్రీదేవి నటించిన చిత్రాలు
లత నటించిన సినిమాలు
జ్యోతిలక్ష్మి నటించిన సినిమాలు
ప్రభాకర్ రెడ్డి నటించిన చిత్రాలు